ఇలాంటి వారితో పోరాడాల్సి రావడం దురదృష్టకరం : చంద్రబాబు
త్వరలో జరగనున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను ( సర్) పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త సీరియస్గా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గొడ్డలి పార్టీ మన ఓట్లు (Votes) తీయించేసి వాళ్ల ఓట్లు చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. మనవాళ్ల ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత. గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీ వెనుక వస్తున్న నీడ మీదో, గొడ్డలి పార్టీదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటలు చేశాను. కానీ ఇలాంటి వారితో పోరాడాల్సి రావడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చనిపోయిందనుకుని వదిలేస్తే విషం చిమ్ముతుంది. డీఎస్పీ (DSP,), నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం (YSR Statue) ధ్వంసంపై గొడ్డలి పార్టీ కుట్రలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ రెండు అంశాల్లో మనం ఆధారాలు బయటపెట్టేసరికి వారు నోరు మÖసుకున్నారని వైసీనీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.







