తెలుగు ప్రజలందరం ఒకే కుటుంబం: సీఎం చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని అన్నారు. అటు తెలంగాణ (Telangana), ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రెండూ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad), ఏపీ రాజధాని అమరావతి (Amaravati) ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమిక పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి అని అన్నారు.
ఇవి కూడా చదవండి








