తెలంగాణ కోసం పోరాటాన్ని గుర్తు చేసిన తెలంగాణ భవన్ వేడుకలు
దశాబ్దాల పోరాటం ఫలించిన రోజే జూన్ 2 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఈ రోజు కేసీఆర్ జీవిత చరిత్రలో పెద్ద రోజు అని చెప్పారు. తెలంగాణ కోసం ఎత్తిన జెండా దింపేది లేదని కేసీఆర్(KCR) ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. పోరాటం మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టాలని అప్పట్లోనే కేసీఆర్ చెప్పారు. పదవీ త్యాగాలకే కాదు, ప్రాణ త్యాగానికీ వెనుకాడని నేత కేసీఆర్. 14 ఏళ్లు పోరాడి రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ చేతిలో ప్రజలు బాధ్యతలు పెట్టారు. పోరాట నాయకుడే పాలకుడైతే బాగుంటుందని ప్రజలు భావించారు. 2028 డిసెంబర్లో కేసీఆర్ మళ్లీ సీఎం(Chief Minister) అవుతారని ప్రజలే చెప్తున్నారు అని అన్నారు.
ఇవి కూడా చదవండి








