TTA మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మెగా కన్వెన్షన్ 2026ను అమెరికాలోని నార్త్ కరోలినా, షార్లెట్ నగరంలో జూలై 17 నుండి 19 వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి, వ్యాపారం, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు ఇండియా, అమెరికా నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. మరోవైపు ‘టి.టి.ఎ మెగా కన్వెన్షన్ 2026’ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మహాసభల ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. జూలై 17 నుండి 19 వరకు, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ దేశం నలుమూలల నుండి వచ్చే తెలుగు కుటుంబాలు, ప్రముఖ నాయకులు, నిపుణులు మరియు యువతతో కళకళలాడనుంది. మన వైభవోపేతమైన తెలుగు సంస్కృతి ఇక్కడ ప్రతిబింబించబోతోంది.
ఈ మహాసభలలో సాంస్కృతిక కార్యక్రమాలు, యువత మరియు మహిళల ఫోరమ్‌లు, సాహిత్య సదస్సులు, వ్యాపార మరియు సి.ఎమ్.ఇ సెమినార్లు, సి.ఎక్స్.ఓ నెట్వర్కింగ్, ఆధ్యాత్మిక సమావేశాలు మరియు వివాహ పరిచయ వేదికలు వంటి ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అన్ని వయసుల వారికి ఇదొక చక్కని మరియు సంపూర్ణమైన అనుభూతిని అందిస్తుంది. మన సాంప్రదాయాల గొప్పదనాన్ని, ప్రతిభను మరియు సమాజ ఐక్యతను మొదటిసారిగా షార్లెట్ నగరానికి టిటిఎ నాయకులు తీసుకువస్తున్నారు. మన వారసత్వాన్ని పండుగలా జరుపుకోవడానికి, సరికొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి మరియు ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడానికి మాతో చేరండి. ప్రతి అడుగులోనూ ఉత్సాహం, ఐక్యత మరియు ప్రతిభను చాటిచెప్పేలా టి.టి.ఎ నిర్వహించబోయే ఈ చారిత్రాత్మక కన్వెన్షన్‌లో అందరూ భాగస్వాములు కావాలని టీటీఎ నాయకులు కోరుతున్నారు.
దాదాపు 4 నుండి 5 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో, 20 వేల మందికి పైగా అతిథులతో మహాసభలు నిర్వహించడానికి ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి తన బృందంతో కలిసి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ ఈవెంట్‌కు ఫస్ట్ ఇన్ఫ్రా సంస్థ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 34 కమిటీలు, 3400 మంది వాలంటీర్లు మహాసభల విజయవంతానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ కన్వెన్షన్‌కు ప్రవీణ్ చింతా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు, స్థానికులకు వ్యాపార అవకాశాలు కల్పిస్తూ 120 నుండి 150 చిన్న తరహా, 30 నుండి 40 భారీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోసం ఫ్రైడే నైట్ హాల్ ఆఫ్ ఫేమ్ బుక్ చేశారు. పరంపర బృందం, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులతో పాటు పలువురు ప్రముఖులు, మ్యూజిక్ ట్రూప్స్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియాలోనూ కొన్ని నగరాల్లో ఎక్స్ పోలు నిర్వహించేలా టీటీఏ ప్రణాళికలు రచిస్తోంది.
‘యూత్ బ్యాంక్వెట్’, ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్’
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘టి.టి.ఎ మెగా కన్వెన్షన్ 2026’ లో ఈసారి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కన్వెన్షన్ ప్రారంభ వారాంతాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు యువత కోసం ప్రత్యేకంగా ‘టి.టి.ఎ యూత్ బ్యాంక్వెట’ మరియు ‘యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ’ కార్యక్రమాలను నిర్వాహకులు ప్రకటించారు.
మెగా ఈవెంట్‌గా టి.టి.ఎ యూత్ బ్యాంక్వెట్
యువతకు సరికొత్త అనుభూతిని, అద్భుతమైన జ్ఞాపకాలను అందించేందుకు షార్లెట్లోని ప్రసిద్ధ నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. 14 ఏళ్లు పైబడిన యువతీ యువకులు ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు.
వేదిక: నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్, షార్లెట్
తేదీ సమయం: శుక్రవారం, జూలై 17, 2026 (రాత్రి 7:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల వరకు)
ప్రవేశ అర్హత: 14 సంవత్సరాలు పైబడిన వారు
ముఖ్య ఆకర్షణలు:
* రసవత్తరమైన సంగీతం, లైవ్ వినోద కార్యక్రమాలు.
* ఇంటరాక్టివ్ నాస్కార్ సిమ్యులేషన్స్.
* హై-ఎనర్జీ డ్యాన్స్ ఫ్లోర్, రుచికరమైన విందు భోజనం.
* కొత్త స్నేహితులను కలుసుకునే అవకాశం మరియు ప్రత్యేక అతిథులతో ‘మీట్ అండ్ గ్రీట’.
* టికెట్ ధర: ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద టికెట్ ధర కేవలం 50డాలర్లు మాత్రమే (పరిమిత సీట్లు మాత్రమే కలవు).
‘షార్క్ ట్యాంక’ శైలిలో యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్!
వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత కలిగిన 12 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థుల కోసం ప్రముఖ వ్యాపార ప్రదర్శన ‘షార్క్ ట్యాంక’ తరహాలో ‘యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి భారీ నగదు బహుమతులతో పాటు, ఇంటర్న్‌షిప్ చేసే సువర్ణావకాశం లభించనుంది.
* వయోపరిమితి: 12-18 సంవత్సరాలు (రెండు విభాగాలుగా పోటీలు ఉంటాయి)
* ప్రిలిమినరీ రౌండ్ (వర్చువల్): జూన్ 2026 లో ఆన్లైన్ ద్వారా జరుగుతుంది.
* గ్రాండ్ ఫినాలే (లైవ్): జూలై 18, 2026 న షార్లెట్ కన్వెన్షన్ వేదికపై ప్రత్యక్షంగా జరుగుతుంది.
* రిజిస్ట్రేషన్ ఫీజు: టి.టి.ఎ సభ్యులకు పూర్తిగా ఉచితం (సభ్యులు కాని వారికి 25 డాలర్లు).
మీలోని సరికొత్త వ్యాపార, సాంకేతిక ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసి, న్యాయనిర్ణేతలను మెప్పించేందుకు ఇదొక అద్భుతమైన వేదిక. అర్హత, ఆసక్తి గల యువతీ యువకులు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని టి.టి.ఎ నిర్వాహక బృందం పిలుపునిచ్చింది.
టీటీఏ మెగా కన్వెన్షన్ బిజినెస్ ఫోరమ్
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’ లో భాగంగా ఏర్పాటు చేయనున్న ‘బిజినెస్ ఫోరమ’ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఉత్తర కారోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి జులై 19, 2026 వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ ఫోరమ్‌లో వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, లీడర్లు, ఇన్నోవేటర్లు ఒకే వేదికపైకి రానున్నారు.
ముఖ్య వక్త: ఈ సంవత్సరం బిజినెస్ ఫోరమ్‌లో ఐమాక్ డెన్వర్ సీఓ, ప్రెసిడెంట్, ప్రముఖ శాస్త్రవేత్త , నోబెల్ ప్రైజ్ నామినీ డా.ఎం.ఎస్.రెడ్డి ముఖ్య వక్తగా హాజరుకానున్నారు. ఆయన విజన్ టు ఎంట్రప్రైజ్… ది జర్నీ ఆఫ్ బిజినెస్ గ్రోత్ అనే అంశంపై ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక బిజినెస్ ఫోరమ్‌ను విజయవంతం చేయడం కోసం ప్రత్యేక కమిటీ బాధ్యతలు నిర్వహిస్తోంది.
* చైర్: శ్రవణ్ కుమార్ వంగూరు
* కో-చైర్స్: మహేష్ లక్కపల్లి, పృథ్వీ రాజ్ బల్లా, అజయ్ రెడ్డి
* సభ్యులు: డా. తరుణ్ మామిడి, మధుకర్ గున్రెడ్డి, వెనేష్ కుమార్ మొల్లేటి
షార్లెట్ వేదికగా మ్యాట్రిమోనీ మీట్ & గ్రీట్
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నూతన వధూవరుల పరిచయాల కోసం ‘మూడు ముళ్ల అనుబంధం… టీటీఏ మ్యాట్రిమోనీ తో ఆరంభం’ అనే నినాదంతో ప్రత్యేక ‘మ్యాట్రిమోనీ మీట్ అండ్ గ్రీట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా మ్యాట్రిమోనీ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీకి చైర్‌గా ఊషా రెడ్డి మన్నెం, కో-చైర్స్‌గా హరి చరణ్ బొబ్బిలి, అరుణ క్రాంతి, మహేష్ వక్కల, సుప్రియ రెడ్డి, మెంబర్‌గా మనీష్ కుమార్ మొతుకూర్ వ్యవహరిస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం..
ఈ వేదిక ద్వారా తెలుగు సింగిల్స్, వివిధ వృత్తుల్లో ఉన్న ప్రొఫెషనల్స్, అన్ని వయసుల గ్రూపుల వారు, వివాహ సంబంధాల కోసం చూస్తున్న కుటుంబాలను ఒకే చోటికి తీసుకురానున్నారు. ఎలాంటి మధ్యతర్తులు లేకుండా నేరుగా ఒకరినొకరు సంప్రదించే అవకాశం కల్పిస్తున్నారు. ఆత్మీయ పరిచయాలు, ఐస్‌బ్రేకర్ యాక్టివిటీస్, సోషల్ మిక్సర్స్ , ప్రైవేట్ ఇంటరాక్షన్ రూమ్స్ వంటి సౌకర్యాలతో కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో దీనిని రూపొందించారు.
శ్రీనివాస కళ్యాణం!
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జులై 17 నుండి 19 వరకు చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో మెగా కన్వెన్షన్ జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా జులై 19న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ‘శ్రీ శ్రీనివాస కళ్యాణం’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన అర్చకులు, ఉత్సవ మూర్తుల సమక్షంలో ఈ కళ్యాణోత్సవం జరగనుంది. భక్తుల కోసం ప్రత్యేక ‘ఎర్లీ బర్డ’ ఆఫర్లను ప్రకటించారు.
కళ్యాణం టికెట్: ఒక కుటుంబానికి (ఇద్దరు పెద్దలు,ఇద్దరు పిల్లలు) 300 డాలర్లు.
కళ్యాణం 2 రోజుల జనరల్ అడ్మిషన్: ఒక కుటుంబానికి (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) 500 డాలర్లు. ఆసక్తి గల వారు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మహి వసిరెడ్డి (704-236-7964) లేదా ప్రశాంత్ చింతను (415-336-2537) సంప్రదించవచ్చు.








