కార్యక్రమాల నిర్వహణలో టిఫాస్ సరికొత్త రికార్డు
రెండేళ్లలో 33 వైవిధ్యభరిత కార్యక్రమాలు
న్యూజెర్సిలోని తెలుగు కళా సమితి (టిఫాస్) ప్రస్తుత బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ హయాంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. 2024-2026 మేనేజింగ్ కమిటీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు అత్యంత విజయవంతంగా 33 విభిన్న కార్యక్రమాలను నిర్వహించి, స్థానిక తెలుగు కమ్యూనిటీలో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. లాభాపేక్ష లేని సాంస్కృతిక సంస్థగా కొనసాగుతున్న టీఫాస్.. కేవలం సాంస్కృతిక వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక, వైద్య, క్రీడా, విద్యా రంగాలకు సంబంధించిన ఎన్నో వైవిధ్యభరితమైన ఈవెంట్లను నిర్వహించి ఆకట్టుకుంది.
విజయవంతంగా సాగిన కార్యక్రమాలు..
* ఎడిసన్ నగరంలో ఉచిత మెడికల్ క్యాంప్, డాక్టర్ ఉన్నతి ఆధ్వర్యంలో పెయిన్ ఫ్రీ లైఫ్ సెమినార్, డాక్టర్ బైరి శ్రీనివాసరావు నేతృత్వంలో నేచురోపతి ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణపై వెబినార్లు నిర్వహించారు.
* టీఫాస్ 2024-26 మధ్యకాలంలో నిర్వహించిన 33 ఈవెంట్ల వివరాలు..
* జూన్ 9, 2024: టీఫాస్ మెడికల్ క్యాంప్
* జూన్ 16, 2024: టీఫాస్ 2024-26 బీఓటీ మీట్ అండ్ గ్రీట్
* జులై 6, 2024: ప్రముఖ గాయని కొండవీటి జ్యోతిర్మయితో టీఫాస్ సంగీత విభావరి
* జులై 21, 2024: తెలుగు ఎన్నారై రేడియోలో టీఫాస్ స్పెషల్ చిట్ చాట్
* ఆగస్టు 10, 2024: అటార్నీల ప్యానెల్‌తో టీఫాస్ లీగల్ సెమినార్
* జులై 28, 2024: టీఫాస్ వార్షిక పిక్నిక్
* సెప్టెంబర్ 14, 2024: టీఫాస్ 2024 వాలీబాల్ టోర్నమెంట్
* సెప్టెంబర్ 14-15, 2024: టీఫాస్ 2024 టెన్నిస్ టోర్నమెంట్
* సెప్టెంబర్ 29, 2024: మంగళంపల్లి బాలమురళీకృష్ణకు నివాళి
* సెప్టెంబర్ 21 – అక్టోబర్ 13, 2024: టీఫాస్ 2024 క్రికెట్ టోర్నమెంట్
* అక్టోబర్ 6, 2024: టీఫాస్ 2024 బ్యాడ్మింటన్ టోర్నమెంట్
* అక్టోబర్ 6, 2024: దీపావళి సంబరాల కోసం టీఫాస్ గాట్ టాలెంట్ మ్యూజిక్, డాన్స్ పోటీలు
* డిసెంబర్ 14, 2024: కైరోప్రాక్టర్ డాక్టర్ ఉన్నతితో ‘నొప్పులు లేకుండా జీవించడం ఎలా’ అనే సదస్సు.
* మార్చి 9, 2025: టీఫాస్-త్రిమూర్తి ఆరాధనా దినోత్సవం
* ఏప్రిల్ 12, 2025: టీఫాస్-ఉగాది వేడుకలు
* జూన్ 14, 2025: సామవేదం షణ్ముఖ శర్మ కోసం ‘శివపాద నాట్య కుసుమాంజలి’
* జూన్ 22, 2025: టీఫాస్ బౌలింగ్ టోర్నమెంట్
* జులై 20, 2025: టీఫాస్ వార్షిక పిక్నిక్
* ఆగస్టు 23, 2025: టీఫాస్ పికల్బాల్ టోర్నమెంట్ 2025
* సెప్టెంబర్ 6, 2025: టీఫాస్ STA=S కాంపిటీషన్స్ 2025
* సెప్టెంబర్ 20, 2025: టీఫాస్ దీపావళి జాతర
* సెప్టెంబర్ 2025: టీఫాస్ క్రికెట్ టోర్నమెంట్
* నవంబర్ 22, 2025: ఇమ్మిగ్రేషన్, న్యాయపరమైన అంశాలపై టీఫాస్ ఆన్లైన్ వెబినార్
* జనవరి 11, 2025: యూఎక్స్-యూఐపై టీఫాస్ ఆన్లైన్ వెబినార్
* జనవరి 10, 2026: కృష్ణ లీలా తరంగిణి
* జనవరి 24, 2026: సంక్రాంతి 2026, పెళ్లి సందడి
* జనవరి 24, 2026: సంక్రాంతి 2026, కవితల పోటీలు
* జనవరి 24, 2026: సంక్రాంతి సంబరాలు 2026
* మార్చి 1, 2026: టీఫాస్ త్రిమూర్తి డే 2026
* మార్చి 3, 2026: డాక్టర్ బైరి శ్రీనివాసరావుతో నేచురోపతీ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ పై వెబినార్
* మే 3, 2026: టీఫాస్ ఉగాది వేడుకలు
* మే 15, 2026: వాలంటీర్ అప్రిసియేషన్ డిన్నర్
* మే 30, 2026: అన్నమయ్యకు ఆరాధన
న్యూజెర్సీలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. ప్రవాస తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతామని టీఫాస్ ప్రతినిధులు వెల్లడించారు.








