హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి సంబరాలు
హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. 1976లో ప్రారంభమై 2026కు 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తొలుత హ్యూస్టన్ లోని ప్రముఖులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ కి యాదగిరి రెడ్డి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గోల్డెన్ జూబ్లి వేడుకలకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఈ వేడుకలకోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించాయి.
ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఐడల్ సింగింగ్, డ్యాన్సింగ్ పోటీలు
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని సరికొత్త హ్యూస్టన్ ఐడల్ పోటీలను నిర్వహిస్తోంది. ‘సింగ్. డాన్స్. షైన్.’ అనే నినాదంతో స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీని ఏర్పాటు చేశారు.
శనివారం, జూన్ 27, 2026న ప్రధానపోటీ జరుగుతుంది. ఐరీన్ స్టెర్న్ కమ్యూనిటీ సెంటర్ ఆరోజు ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలను మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నారు.
సబ్ జూనియర్: 8 నుండి 13 సంవత్సరాలు
జూనియర్: 14 నుండి 19 సంవత్సరాలు
సీనియర్: 20 సంవత్సరాలు పైబడిన వారు
పోటీల రకాలు: గానం: సోలో (సింగిల్) మాత్రమే.
నృత్యం: సోలో మరియు గ్రూప్ డాన్స్ (కనీసం ఇద్దరు, గరిష్టంగా 10 మంది).
ప్రత్యేక ఆకర్షణ: ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆగస్టు 8, 2026న “ఫోర్ట్ బెండ్ ఎపికెంట్టర” లో జరిగే టిసిఎ గోల్డెన్ జూబ్లీ ప్రధాన వేడుకల్లో లైవ్ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చే అద్భుత అవకాశం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు: ప్రతి పార్టిసిపెంట్‌కు 50 డాలర్లు చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 5, 2026 గా నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని TTA ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి, కల్చరల్ కమిటీ డైరెక్టర్ శారద ఆకునూరి, చైర్ స్నేహ రెడ్డి చిర్ర మరియు కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
సమితి పెద్దల పిలుపు
ఈ వేడుకలను దిగ్విజయం చేయాలని హెచ్.టి.సి.ఎ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి మరియు కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు పిలుపునిచ్చారు. యువత కోసం ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యూత్ ఫోరమ్‌లో చేరాలనుకున్నవారు కిరణ్ నెక్కంటి (832-540-8041), శ్రీ సురెడ్డి (832-620-3065)ని సంప్రదించవచ్చు.
జూలై 18న ‘టిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్’
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా క్రీడాభిమానుల కోసం మరొక భారీ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ‘టిపిఎల్ క్రికెట్ టోర్నమెంట’ పేరిట ప్రత్యేక క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. జూలై 18, శనివారం (2026), ఉదయం 7:00 గంటల నుండి ఈ పోటీలు ప్రారంభమవుతాయి. టెక్సాస్‌లోని 24502 వెస్ట్ రోడ్, సైప్రస్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే టీములు ప్రవేశరుసుముగా 60 డాలర్లు చెల్లించాలి.
ఈ పోటీలను మూడు ప్రధాన విభాగాలలో నిర్వహించనున్నారు. పురుషుల విభాగం, మహిళల విభాగం, పిల్లల విభాగంలో నిర్వహిస్తారు. మ్యాచ్‌లు 6 ఓవర్ల ఫార్మాట్లో సాగుతాయి. 30 యార్డ్స్ బౌండరీ లైన్ ఉంటుంది. పోటీలకు టాప్డ్ టెన్నిస్ బాల్ ఉపయోగిస్తారు.
ఈ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయాల్సిందిగా హెచ్.టి.సి.ఎ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి మరియు కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు కోరారు. క్రీడా కమిటీ చైర్మన్లుగా గోపి నిడ్జల్లి, ఉదయ్ సోమ, అడ్వైజర్‌గా శరత్ యెంపాటి మరియు కో-ఆర్డినేటర్లుగా చక్రి, అశ్వంత్ వ్యవహరిస్తున్నారు.
జూలై 11న ‘టిపిఎల్ పికల్బాల్’ టోర్నమెంట్
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ‘టిపిఎల్ పికల్బాల్’ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. జూలై 11, శనివారం ఉదయం 8:30 గంటల నుండి ఈ పోటీలు జరుగుతాయి. టెక్సాస్‌లోని 6541 స్టాక్డిక్ స్కూల్ రోడ్, కేటీలోని పికల్బాల్ విలేజ్ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఆటగాడు 20 డాలర్లు ప్రవేశరుసుముగా చెల్లించాలి.
హ్యూస్టన్ తెలుగు సంఘం
ఈ టోర్నమెంట్‌ను మూడు ప్రధాన విభాగాలలో నిర్వహించనున్నారు: పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, పిల్లల డబుల్స్ విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేశారు.
టిపిఎల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ‘టిపిఎల్ బ్యాడ్మింటన’ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. జూన్ 13, శనివారం ఉదయం 9:30 గంటల నుండి ఈ పోటీలు జరుగుతాయి. ఎరైజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ప్రతి ఆటగాడు ఎంట్రీ ఫీజుగా20 డాలర్లు చెల్లించాల్సి ఉంది.
కన్వెన్షన్ ముఖ్య కమిటీలు
* కన్వెన్షన్ కోర్ కమిటీ: జితేందర్ రెడ్డి (కన్వీనర్), యాదగిరి రెడ్డి (ప్రెసిడెంట్), రాజశేఖర్ యలమంచిలి (అడ్వయిజరీ కౌన్సిల్), గిరీష్ రామిరెడ్డి (ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్), రాజ్ పసý (జనరల్ సెక్రటరీ), ప్రసాద్ మారగాని (ఈవెంట్ డైరెక్టర్), దామోదర్ జమ్మి (ట్రస్టీ), ప్రసాద్ కల్వ (ట్రస్టీ), రాము ఉప్పలపాటి (కన్వెన్షన్ ట్రజరర్), శ్రీధర్ కాంచనకుంట్ల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), రవి గుణిశెట్టి (ఈవెంట్ కో ఆర్డినేటర్).
* అడ్వయిజరీ కౌన్సిల్ కమిటీ: రాజశేఖర్ యలమంచిలి, చిట్టెన్ రాజు వంగూరి, మల్లిక్ పుచ్చా, జనార్థన్ రెడ్డి వింట, రవి తమిరిశ, కిరణ్ మద్దినేని.
* సెరిమోనియల్ కమిటీ: పద్మశ్రీ ముత్యాల, శారద ఆకునూరి, రమేష్ చెరివిరాల
* టిసిఎ ట్రస్టీలు: దామోదర్ జమ్మి, ఆశాజ్యోతి దేవకి, ఉషా రంగరాజ్.
* కన్వెన్షన్ ట్రస్టీలు: ప్రసాద్ కల్వ, బంగార్ రెడ్డి
* అడ్వయిజరీ కమిటీ: రత్నకుమార్, బంగార్ రెడ్డి, రాజ్ చప్పిడి, రవి వర్రె, శ్రీధర్ పాటిబండ్ల, సతీష్ నన్నపనేని, వెంకట్ వీరిశెట్టి, రామ్ చెరువు, క్రాంతి నెద్నూర్, రమేష్ అకరపు.
* అడ్హాక్ కమిటీ: రవి గుణిశెట్టి, శ్రీకాంత్ రెడ్డి








