తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) శుభాకాంక్షలు (Best wishes) తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్లో తెలంగాణ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి ( Telangana Development)కి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం గొప్పదని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార నైపుణ్యానికి ప్రసిద్ధి చెందినవారని మోదీ కొనియాడారు. ఈ రాష్ట్రం ధైర్యానికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్రను, వైభవమైన సంస్కృతి (Culture)ని కలిగి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ నూతన ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారని అన్నారు. ఈ రాష్ట్రం తన అద్భుతమైన సంస్కృతి, చరిత్రకు పేరుగాంచిందని, అది ధైర్యం, సంకల్పంతో కూడినదని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








