పవన్ కల్యాణ్‌పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆంధ్ర (Andhra ) మూలాలు ఉన్న నాయకుడని, నటుడిగా ఆయన్ను అభిమానించినప్పటికీ రాజకీయంగా వ్యతిరేకిస్తానన్నారు. పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కి ఉపముఖ్యమంత్రి (Deputy Chief Minister)గా ఉన్నారు. ఎవరో వెనుక ఉండి ఆయన్ను నడిపిస్తున్నారు. నటుడిగా పవన్‌ను అందరం అభిమానిస్తాం. కానీ రాజకీయంగా విభేదిస్తాం అని తెలిపారు.








