కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లటం ఖాయం : మహేశ్ గౌడ్
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనేది వాస్తవమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గానీ, సంబంధిత నివేదికను గానీ, దర్యాప్తు తీరునుగానీ హైకోర్టు తప్పుపట్టలేదని, కాళేశ్వరంపై ఎన్డీఎసఏ నివేదికను కూడా తప్పుపట్టలేదని అన్నారు. విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తప్పుపట్టిందన్నారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందనేది వాస్తవని చెప్పారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లటం ఖాయం. హైకోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు అనలేదా? బిఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ఏటీఎంగా మారందని మోదీ (Modi), అమిత్ షా (Amit Shah) గతంలో ఆరోపించారు. సీబీఐకి అప్పగిస్తే రెండ్రోజుల్లోనే దోషులను జైల్లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సీబీఐ దర్యాప్తు కోరితే కేంద్రం చర్యలు తీసుకోలేదు. మరి సీబీఐ దర్యాప్తు ఎందుకు ప్రారంభం కాలేదో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








