భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయి : మహేశ్ కుమార్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. బిఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) వేర్వేరు కాదని, భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్దతికి తాము వ్యతిరేకమన్నారు. దక్షిణ భారతకు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందన్నారు.
ఇవి కూడా చదవండి








