Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వదలుకోదలచుకోలేదు : మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీని వీడొద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy)ని కోరామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డితో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) , ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్ (Sachin Sakewat)తో కలిసి ఆయన సమావేశమయ్యారు. అనంతరం మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, 43 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి. ఆయన మాకు తండ్రిలాంటివారు. రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. జీవన్ రెడ్డి కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వదలుకోదలచుకోలేదు. పార్టీ వీడే అంశంలో పునరాలోచన చేయాలని కోరాం అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








