Jeevan Reddy: రాజకీయాల్లో తనది పూలబాట కాదు.. ముళ్ల బాట : జీవన్ రెడ్డి
తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు చూసిందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలోని తన నివాసానికి పార్టీ అధిష్ఠానం పంపిన ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనకు పీసీసీ చీఫ్ పదవి రాకున్నా, పార్టీ అధికారంలోకి వచ్చినందుకు సంతోషపడ్డానన్నారు.రాజకీయాల్లో తనది పూలబాట కాదని, ముళ్ల బాట అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ కాబట్టి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ముఖ్యమంత్రి, సీఎల్పీ లీడర్ కాబట్టి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారన్నారు. మరి తనకెందుకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పార్టీ ఫిరాయింపుల్లో మనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆదర్శం కాదు కదా? అంటూ కాంగ్రెస్ నేతలకు జీవన్ రెడ్డి చరకలంటించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏమిటి? మనం చేస్తున్నదేమిటంటూ రాష్ట్రంలోని పార్టీ నేతలను ఈ సందర్భంగా ఆయన సూటిగా నిలదీశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాలు వంటి నేత ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకు అంటూ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా కొంత అసహనం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనను బుజ్జగించలేదన్నారు. తాను పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి, అలా వచ్చి వెళ్లారంటూ కాంగ్రెస్ ప్రతినిధుల రాకపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి








