మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు సరైన పండ్లు కూడా చాలా అవసరం. కొన్ని పండ్లు గట్ హెల్త్‌ను మెరుగుపరచి జీర్ణక్రియను సాఫీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అరటిపండు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.
బొప్పాయి కడుపు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని పపైన్ ఎంజైమ్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
యాపిల్‌లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది పేగులను శుభ్రంగా ఉంచి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది.
దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గట్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది మంచి ఎంపిక.
కివీ పండు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని సహజ ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పైనాపిల్‌లో ఉండే బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే గట్ హెల్త్ మెరుగుపడటంతో పాటు శరీరం కూడా తేలికగా, ఆరోగ్యంగా ఉంటుంది.