తానా ఆధ్వర్యంలో మజ్జిగ, పళ్ళ రసాల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణప్రసాద్ సోంపల్లి సహకారంతో విశాఖ పట్నం తూర్పు నియోజకవర్గం 16వ వార్డులో విశాఖపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొల్లి శోభ ఆధ్వర్యంలో కృష్ణా కళాశాల రహదారిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనయుడు ప్రతాపరుద్ర మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి అందరికీ మజ్జిగ, పళ్ళ రసాలను పంపిణీ చేశారు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్ నల్లూరి, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాకినేని శ్రీనివాస్, మారుతి, ముగడ వాసు, ధన రెడ్డి బుగత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










