డబుల్ ఎంటర్టైన్మెంట్కు రంగం సిద్ధం చేస్తున్న వెంకటేష్
విక్టరీ వెంకటేష్(venkatesh) ప్రస్తుతం తన కెరీర్లో మరో కీలక దశను ఆస్వాదిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న వెంకీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)తో కలిసి రూపొందిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనే టార్గెట్ తో టీమ్ పని చేస్తోంది. షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఆదర్శ కుటుంబం(aadarsha Kutumbam) తర్వాత వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనుల్లో నిమగ్నమై ఉండటంతో, అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వెంకటేష్ మాత్రం తన ప్రాజెక్ట్‌ల విషయంలో చాలా క్లియర్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆదర్శ కుటుంబంను అక్టోబర్‌లో రిలీజ్ చేసి, వెంటనే అనిల్ రావిపూడి సినిమాను శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఆ సినిమాను 2027 సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో పని జరుగుతున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో రెండు పెద్ద సినిమాలతో అభిమానులను అలరించే అవకాశాలు కనిపిస్తుండటంతో వెంకీ అభిమానుల్లో ఇప్పటికే ఉత్సాహం నెలకొంది.








