ఆగస్టు 7, 8 తేదీల్లో TCA స్వర్ణోత్సవాలు
TCA : హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ప్రతిష్టాత్మక 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను (50 Years Golden Jubilee Celebrations) పురస్కరించుకుని భారీ సాంస్కృతిక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. 2026 ఆగస్టు 7, 8 తేదీలలో టెక్సాస్ రోసెన్‌బర్గ్ లోని ‘ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్’ (Fort Bend Epicenter) వేదికగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రూపకల్పన చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రత్యేక దృశ్య కావ్యాలు “స్వాగత గీతం” , “స్వర్ణ వైభవం” లలో పాల్గొనడానికి ప్రతిభావంతులైన నర్తకులు, నటీనటుల (Call for Dancers & Actors) నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
వివరాలు..
సుమారు 75 మంది నర్తకులు, నటీనటులు అవసరం.
10 సంవత్సరాలు , ఆపైబడిన వారు (10+ Years & Above) అర్హులు.
భరతనాట్యం, కూచిపూడి, జానపదం (Folk), బాలీవుడ్ , ఇండియన్ ఫ్యూజన్. నటనపై ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత ఉంటుంది.
ప్రముఖ నృత్య గురువు డాక్టర్ రత్నకుమార్ (అంజలి సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్) ఈ ప్రదర్శనలకు నృత్య దర్శకత్వం వహిస్తారు.
రిహార్సల్స్ , రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ ప్రదర్శనలకు సంబంధించిన రిహార్సల్స్ జూన్ 10, 2026 నుండి ప్రారంభమై, ఆగస్టు 8, 2026 వరకు కొనసాగుతాయి. ఎంపికైన వారు ప్రతి రిహార్సల్ కు హాజరుకావడం తప్పనిసరి. ఆసక్తి గలవారు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 10, 2026.
TCA 50 సంవత్సరాల వైభవాన్ని వేదికపై ఆవిష్కరించే ఈ చారిత్రాత్మక ప్రదర్శనలో భాగస్వాములు కావడానికి, ఫ్లయర్ లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ (QR Code) లేదా గూగుల్ ఫామ్ లింక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని సమితి అధ్యక్షులు యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి , కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు కోరుతున్నారు.
సంప్రదించాల్సింది..
మరింత సమాచారం కోసం రామ్ చెరువు (832) 754-7802 లేదా dance@tca.org మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.








