తెలుగు వేడుకకు ముస్తాబైన ఫిలడెల్ఫియా.. మాటా 2వ కన్వెన్షన్‌కు అంతా సిద్ధం
అమెరికాలో మరో తెలుగు వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 19, 20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో అమెరికాలోని తెలుగు సమాజాన్ని, సంస్కృతిని, ఐక్యతను చాటిచెప్పేలా ప్రతిష్టాత్మక ‘మాటా’ (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) రెండో మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మైలురాయి లాంటి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాది మంది భారతీయ అమెరికన్లను ఒకే తాటిపైకి తెచ్చే ఈ రెండు రోజుల పండుగ.. సరికొత్త ప్రేరణకు, బంధాల కలయికకు వేదిక కానుంది. ఈ కన్వెన్షన్ కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, మన తెలుగు జాతి జీవన విధానానికి ప్రతిరూపంగా నిలవనున్నది. ఇందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మాటా సంస్థ సేవ, సంస్కృతి, సమానత్వం అనే మూడు ముఖ్యమైన పిల్లర్లపై పనిచేస్తుందని, అందుకు తగ్గట్టుగా ఈ మహాసభలు ఆ విలువలనే ప్రతిబింబించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సమాజ సేవకు, ప్రతిభా గుర్తింపునకు ప్రాధాన్యతనిస్తూనే మన భావి తరాలు మన గొప్ప సంస్కృతీ సాంప్రదాయాలను గర్వంగా ముందుకు తీసుకెళ్లేలా ఈ వేడుకలు స్ఫూర్తిని నింపుతాయని నిర్వాహకులు తెలిపారు.
అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ మహాసభకు అమెరికా నలుమూలల నుండి 5,000 నుండి 7,000 మంది వరకు తెలుగు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామా జిక, వ్యాపార, యువతకు సంబంధించిన అనేక కార్యక్రమాలతో ఈ రెండు రోజుల వేడుక తెలుగు సమాజానికి ఒక మహోత్సవంగా నిలవనుంది.
మహాసభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారు హాజరుకానున్నారు. అదేవిధంగా ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల, గాయని సమీరా భారద్వాజ్, నటి ఐశ్వర్య రాజేష్, రీటా, నిఖిల్, అలి, రామచారి, స్వాతి రెడ్డి తదితర సినీ, టెలివిజన్ ప్రముఖులు పాల్గొననున్నారు.
వినోద కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల ప్రత్యేక సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించనుండగా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే గ్రాండ్ ఫినాలే కాన్సర్ట్ మహాసభకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
అదేవిధంగా భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం, యూత్ ఫోరం, పాలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, లీగల్ ఫోరం, సీఎంఈ సెషన్లు, అలుమ్నీ సమావేశాలు, మ్యాట్రిమోనీ ఫోరం, ఏఐ హ్యాకథాన్, మాటా సింగింగ్ స్టార్ పోటీలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ మహాసభలో 100కు పైగా వ్యాపార మరియు ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో సందర్శకులకు షాపింగ్, వ్యాపార పరిచయాలు మరియు నెట్‌వర్కింగ్‌కు విశేష అవకాశాలు లభించనున్నాయి.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ సేవ, యువత నాయకత్వం మరియు కమ్యూనిటీ ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభ తెలుగు ప్రజలకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ కన్వెన్షన్‌ను నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా శ్రీనివాస గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి ఉన్నారు. కన్వెన్షన్ కోర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా రమణ కిరణ్ దుద్దగి (ప్రెసిడెంట్), శ్రీధర్ గుడలా (కన్వీనర్), టోనీ జన్ను (కో కన్వీనర్), దాము గెదెల (కో కన్వీనర్), ప్రవీణ్ గూడురు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), వ్పుియ్ భాస్కర్ కలాల్ (సెక్రటరీ), గంగాధర్ ఉప్పల (కో ఆర్డినేటర్), కల్యాణి బెల్లంకొండ (కో ఆర్డినేటర్), నగేష్ చిలకపాటి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), శిరీష గుండపునేని (స్ప్రిట్చువల్ అండ్ మెంబర్ షిప్ డైరెక్టర్), మహేందర్ నరాల (ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్), స్వాతి అట్లూరి (ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ డైరెక్టర్), శ్రీధర్ పెంట్యాల (అడిషనల్ సెక్రటరీ), ప్రశాంత్ శ్రీపెరంబుదూరు (పబ్లిసిటీ, పిఆర్ మీడియా డైరెక్టర్), డా. విజయ్ భాస్కర్ బొల్గామ్ (ఇండియా కో ఆర్డినేటర్), సురేష్ ఖజానా(స్పోర్ట్స్ డైరెక్టర్) ఉన్నారు.
మహాసభల సందర్భంగా సంగీత ప్రియుల కోసం ‘మాటా సింగింగ్ స్టార’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, ఎలఎమఏ బాలగంధర్వం వ్యవస్థాపకులు డాక్టర్ రామాచారి కొమండూరి అడ్వైజర్Yగా వ్యవహరిస్తున్నారు.
ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి; ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గూడల మరియు ఆర్గనైజింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ‘ఎక్స్‌పాట్ మనీ’, ‘ఎమ్ ఎస్ ఎన్ ఓ రియల్టీ’ సంస్థలు ఈవెంట్‌కు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
విభిన్న కార్యక్రమాలు
తన రెండవ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన మాటా ఫ్యూచరిస్టిక్ ఎఐ హ్యాకథాన్ 2026 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎంతో పవిత్రమైన ‘భద్రాచలం సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం’ వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. కళ్లు చెదిరే సాంస్కృతిక ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ కన్సర్ట్లు, గ్రాండ్ ఫినాలే మరియు ప్రత్యేక బ్యాంకెట్ డిన్నర్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వ్యాపార, యువజన సదస్సులు, సాంస్కృతిక వేడుకలతో పాటు, ఈ మహాసభలు సరికొత్త అవకాశాలకు ద్వారాలు తీయనున్నాయి. బిజినెస్ ఎక్స్‌పోలు, ప్రొఫెషనల్ ఫోరమ్‌లు, నెట్వర్కింగ్ సెషన్ల ద్వారా యువత, మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ఈ వేదికపై ఘనంగా సత్కరించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణలు ఈ రెండు రోజుల మెగా కన్వెన్షన్‌లో టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, గాయకులు, యాంకర్లు మరియు హాస్యనటులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రవాసాంధ్రులను అలరించనున్నారు. సీనియర్ నటి జయప్రద, ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సీనియర్ నటుడు సుమన్, నటి ఐశ్వర్య రాజేష్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇన్ కాన్సెర్ట్‌తో పాటు, ట్రెండింగ్ సింగర్ రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్, రీటా, సాగర్, కార్తీక్ మాల్యాల బృందాల లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్లు ఉండనున్నాయి. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు రామచారి ప్రత్యేక సంగీత కార్యక్రమం ప్రేక్షకులను మురిపించనుంది. యాంకర్ సుమ కనకాల, ఆర్జే భార్గవి, నిఖిల్ల యాంకరింగ్‌తో పాటు.. ప్రముఖ హాస్యనటులు అలీ, శివారెడ్డి, మిమిక్రీ రమేష్, అదరి అభి, సుధాకర్, ముఖ్దూమ్ సయ్యద్‌ల కామెడీ షోలు నవ్వుల పూయించ నున్నాయి. వినూత్న సదస్సులు, సాంస్కృతిక వినోదంతో పాటు ఈ మహాసభల్లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో కీలక ఫోరమ్‌ల సమావేశా లను కూడా ఈ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
సిఎంఇ కమిటీ ఆధ్వర్యంలో ప్రవాస వైద్యుల కోసం ప్రత్యేకంగా కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు. లీగల్ ఫోరమ్ ఆధ్వర్యంలో వలసలు, వ్యాపార చట్టాలపై ప్రవాసులకు అవగాహన కల్పించే ప్రత్యేక లీగల్ సెషన్స్ కూడా ఈ వేడుకల్లో ఉంటాయి. జూన్ 20న జరిగే ప్రత్యేక పొలిటికల్ ఫోరమ్ ద్వారా ప్రవాస తెలుగువారి లీడర్షిప్ మరియు పబ్లిక్ సర్వీస్‌పై చర్చిస్తారు. పెళ్ళి సంబంధాల వేదిక (మ్యాట్రిమొనీ మీట్), ప్రతిభావంతులకు ‘ఎక్సలెన్స్ అవార్డ్స’ ప్రదానం. యువతీ యువకుల సంగీత ప్రతిభను ప్రోత్సహించేందుకు నేషనల్ లెవెల్ ‘మాటా సింగింగ్ స్టార’ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ కన్వెన్షన్‌లో భారీ ఎత్తున సినీ తారలు, సంగీత విద్వాంసులు సందడి చేయను న్నారు. సింగర్ రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్ బృందం అలరించనున్నారు.
ఇప్పటికే కన్వెన్షన్‌కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రవాస తెలుగువారందరూ ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు తెలుగు సంస్కృతీ వైభవాన్ని, ప్రవాస తెలుగువారి ప్రతిభను ఒకే వేదికపై చూసేందుకు వీలుగా ఈ ఏర్పాట్లను మహాసభల కమిటీ చేస్తోంది. తెలుగువారంతా కలిసికట్టుగా ఈ మహాసభలను జయప్రదం చేÖలని ‘మాటా’ కమిటీ కోరుతోంది.








