అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : ప్రహ్లాద్ జోషి
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ (Narendra Modi) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) స్పష్టం చేశారు. విజయవాడ లోని వాజ్‌పేయి పార్కులో స్వచ్ఛభారత్‌లో భాగంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోయారన్నారు. 2014కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్షీణ దశలో ఉందని, మోదీ ప్రధాని అయ్యాక అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరిగిన రెండో దేశ భారత్ అని వివరించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు 8 రెట్లు పెరిగాయి. అమరావతి కోసం హడ్కో నుంచీ రూ.11 వేల కోట్లు ఇచ్చామని, అమరావతి కనెక్ట్ చేస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కోసం నిధులు సమకూర్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ( Chandrababu), పవన్ (Pawan), మాధవ్ కలిసి బాగా పని చేస్తున్నారని జోషి కితాబిచ్చారు. రాజధాని అమరావతికి రోడ్, రైల్వే కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.








