ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు సంక్షోభం.. ప్రపంచం బయట పడేదెన్నడు..?
పశ్చిమాసియా శాంతి ఒప్పందం కుదిరింది. ట్రంప్-ఇరాన్ శాంతి గీతిక ఆలపించాయి. అది సరే.. ఇన్నాళ్లు హర్మోజ్ బంద్ చేయడంతో ..ప్రపంచం అల్లాడిపోయింది . ఇప్పుడు హర్మూజ్ తెరుచుకోనుంది. మరి ఈ చమురు సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడినట్లేనా..? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. చమురు చైన్ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని.. అది తిరిగి క్రమబద్ధీకరణ జరగడానికి కొన్ని నెలల పాటు సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతానికి ప్రాతినిధ్యం వహించే హర్మూజ్ జల సంధి నుంచి రవాణా ఆగిపోవడంతో అల్లకల్లోలమైంది. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరినా.. ప్రపంచ దేశాలకు సరఫరా పూర్తిస్థాయిలో జరగడానికి నెలల సమయం పడుతుంది. ఫలితంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిన పడేందుకు సంవత్సరా సమయం పడుతుందంటున్నారు నిపుణులు.
మెరైన్ ట్రాఫిక్ వివరాల ప్రకారం.. ఆదివారం రెండు నౌకలు మాత్రమే హర్మూజ్ దాటాయి. అందులో ఒకటి బల్క్ క్యారియర్ కాగా.. మరొకటి చమురు నౌక. మందు పాతరల కారణంగా.. హర్మూజ్ దగ్గర వందలాది నౌకలు నిలిచిపోయాయి. అవన్నీ కదలాలంటే ముందుగా మందుపాతరలు తొలగించాలి. ఓవేళ నౌకలు సిద్దంగా ఉన్న చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. అవన్నీ పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించాలంటే.. భారీగా ఖర్చు, చాలా సమయం పడుతుంది.
బ్యారెల్ చమురు ధర యుద్దం ప్రారంభమయ్య సమయానికి 70 డాలర్లుగా ఉంది. ఇప్పుడు అదే బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూపాయితో పోలిస్తే డాలర్ విలవ83 రూపాయల వద్ద కదలాడుతోంది.








