షాంఘై మహానగరంలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు షాంఘై తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 24-25, 2026 (శుక్రవారం, శనివారం) తేదీలలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు షాంఘై మహానగరంలో జరుగుతుంది. భారత పూర్వ ఉపరాష్ట్రపతి, “పద్మవిభూషణ్” గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటులు, కవి శ్రీ తనికెళ్ళ భరణి, తదితరులు ఆహ్వానిత అతిధులుగా విచ్చేస్తున్న ప్రతిష్టాత్మమైన ఈ సదస్సులో పాల్గొని , ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులని ఆహ్వానిస్తున్నాం. వివరాలకి జత పరిచిన మొదటి ప్రకటన చూడండి.
చైనా దేశంలో పలు నగరాలలో నివసిస్తున్న తెలుగు సాహితీవేత్తలు, భాషాభిమానులు ప్రత్యక్షంగా కలుసుకునే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనడానికి ప్రాధమిక ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది Google Form లో నమోదు చేసుకుని తమ వివరాలని అందించమని కోరుతున్నాం.
https://forms.gle/v6K3RpT3wei8KVyU8
భారత దేశంతో సహా, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి అయినా తమ స్వంత ఖర్చులతో షాంఘై నగరానికి విచ్చేసి ఈ 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొనదల్చుకున్న ప్రతినిధులకు, వక్తలకు మూడు రోజులు ఉచితంగా స్థానిక వసతి, ఆత్మీయ ఆతిధ్యం కల్పించడతాయి. ఏ దేశం వారు అయినా చైనా దేశానికి వచ్చే వీసా, విమాన ప్రయాణం ఏర్పాట్లు తామే ఏర్పాటు చేసుకోవాలి. సదస్సు కార్యనిర్వాహక వర్గం ఎటువంటి బాధ్యతా స్వీకరించదు.
భవదీయులు,
10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం,
వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా)
కోలన్ మాధవ రెడ్డి (షాంఘై తెలుగు సంఘం, షాంఘై, చైనా)
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సస్, అమెరికా),
రాధిక మంగిపూడి( ముంబై)
నాగ మల్లికార్జున రావు తోట (షాంఘై):
భవాని వాసిరెడ్డి (షాంఘై):
జయ పీసపాటి (హాంగ్ కాంగ్):
రత్నకుమార్ కవుటూరు (సింగపూర్)








