ఎన్డీయే కి ఎదురే లేదిక.. రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ దిశగా…
దేశంలో రాజకీయాలు అధికార బీజేపీకి బాగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ లో అధికారం చేపట్టిన తర్వాత మార్పులు మరింత స్పష్టంగా గోచరిస్తున్నాయి. తాజాగా.. తృణమూల్ లో చెలరేగిన వివాదం, రెబెల్స్ వేరు కుంపటి పెట్టుకోవడం అధికార ఎన్డీయేకి వేయి ఏనుగుల బలం తెచ్చిపెట్టింది.
ఈ పరిణామాలు ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో విజయం, టీఎంసీలో తిరుగుబాటు బావుటా ఎగరేయడంలాంటి పరిణామాలు ఎన్డీయేకి రాజ్యసభలోకలిసి వస్తున్నాయి. రాజ్యసభలో బీజేపీకి కాస్త బలం అవసరం వుంది. ఈ పరిణామాలు మరింత కలిసి రానున్నాయి.
రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకి 148 మంది సభ్యులున్నాయి. తాజా ఎన్నికల్లో 19 స్థానాలను ఎన్డీయే దక్కించుకుంది. మరో 3 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అందులో ఒకటి లేదా రెండు గెలిచే అవకాశాలున్నాయి. అవి కాకుండా బెంగాల్ లో రాజీనామా చేసిన ముగ్గురు తృణమూల్ సభ్యుల స్థానాల్ని ఉప ఎన్నికల్లో ఎన్డీయేనే గెలుచుకునే ఛాన్స్ వుంది. ఈ లెక్క గనక సరిపోతే.. బలం 154 కి చేరుతుంది. 2/3 వంతు మెజారిటీయే లక్ష్యంగా కదులుతున్నారు. జార్ఖండ్, మిజోరాం లో స్వతంత్ర అభ్యర్థులు స్థానాలను గెలుచుకోవడం ద్వారా అదనంగా మూడు స్థానాలను దక్కించుకోనుంది. ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల అనంతరం బెంగాల్ లోని మూడు సీట్లనూ ఎన్డీయే కైవసం చేసుకోనుంది. దాంతో ఎన్డీయే బలం 154 కి చేరనుంది. రాజ్యసభలో మూడింటి రెండు వంతుల మెజారిటీకి ఇది తొమ్మిది సీట్ల తక్కువ దూరంలో నిలిచిపోనుంది. రాజ్యసభలో మరి కొంత మంది టీఎంసీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశం వున్నందున, ఎన్డీయే 163 సీట్ల మెజారిటీని సాధించే అవకాశాలున్నాయి.








