కేదార్ నాథ్, బదరీనాథ్ కి 10 కోట్ల విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన బదరీనాథ్ ను దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు.. ఆలయ కమిటీ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహణ కోసం 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
బదరీనాథ్ ను సందర్శించిన తర్వాత ఆయన కేదార్ నాథ్ ధామ్ ని కూడా సందర్శించారు. ఆలయాభివృద్ధి కోసం, యాత్రికులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు 10 కోట్లను విరాళంగా ప్రకటించారని బీకేటీసీ ఈవో ప్రకటించారు. అయితే.. ప్రతి యేడాది కూడా ముకేశ్ కేదార్, బదరీనాథ్ ధామ్ లను దర్శిస్తారు. గత యేడాది కూడా ఆయన ఈ ధామ్ ను సందర్శించారు.








