మొదట మమతా బెనర్జీ, ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే… ఆ తర్వాత ఎవరో?
బెంగాల్ లో తృణమూల్ ఓటమి తర్వాత రాజకీయాలు మారిపోతున్నాయి. తృణమూల్ లో ఏకంగా 20 మంది ఎంపీలు రెబెల్స్ గా మారిపోయారు. ఎన్డీయేతో కలిసి పనిచేస్తామని ప్రకటించేశారు. దీంతో మమతా బెనర్జీకి తీవ్ర షాక్ తగిలింది. దీంతో కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని తృణమూల్- కాంగ్రెస్ మధ్య డీల్ కూడా కుదిరిందని వార్తలు జోరుగా వచ్చాయి.
ఇదిలా వుండగా.. మరో వైపు మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ థాకరే అచ్చు మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న వాతావరణాన్నే ఎదుర్కొంటున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు డిప్యూటీ సీఎం షిండేతో భేటీ అయ్యారని, వారు కూడా పార్టీ మారిపోతున్నారని వార్తలు వచ్చాయి. బీజేపీ ‘‘ఆపరేషన్ టైగర్’’ ప్రారంభించిందని, ఈ నేపథ్యంలోనే వారంతా డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
దీంతో ఉద్ధవ్ థాకరే అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరితో తన నివాసంలో భేటీ అయ్యారు. అయితే.. మొత్తం 9 మంది ఎంపీలుంటే.. కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో శివసేనలో కూడా చీలిక ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో కూడా ‘ఆపరేషన్ టైగర్’ అనే మరో చర్చనీయాంశమైన కార్యక్రమం గురించి ప్రస్తావన జరుగుతోంది, దీనికి సంబంధించిన ప్రాథమిక సంకేతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ‘ఖేలా’ ఆపరేషన్ లక్ష్యం ఇప్పటికే పూర్తయినప్పటికీ, తదుపరి లక్ష్యం ఎవరనేది వేచి చూడాల్సి ఉంది.
ఆపరేషన్ ఖేలా పూర్తి…
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో ఇరవై మంది ఎన్‌సిపిఐలో చేరాలని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, విలీనానికి సంబంధించిన అధికారిక లేఖను సమర్పించారు. తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కాకోలీ ఘోష్, పార్లమెంటులో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా అభ్యర్థించారు.తిరుగుబాటు వర్గం నాయకులలో సీనియర్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ కూడా ఉన్నారు.
ఆపరేషన్ టైగర్..
పశ్చిమ బెంగాల్లో కొత్త ‘రాజకీయ క్రీడ’ ముగియకముందే, గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘ఆపరేషన్ టైగర్’ హాట్ టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన కొందరు నాయకులు మరియు ఎంపీలు, ఏక్నాథ్ షిండే వర్గంలోని నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న చర్చ జరుగుతోంది.అయితే, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహచర నాయకులు ‘ఆపరేషన్ టైగర్’కు సంబంధించిన చర్చలను లేదా ప్రయత్నాలను పూర్తిగా కొట్టిపారేశారు. అటువంటి ప్రచారమేదీ జరగడం లేదని, అలాగే ఇతర పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునే ఆసక్తి తమ పార్టీకి లేదని శివసేన అధికార ప్రతినిధి రాజు వాఘ్మరే పేర్కొన్నారు.
మొదట బెంగాల్ లో ప్రకంపం ప్రారంభమైంది. అంతలోనే మహారాష్ట్రలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే తనదే అసలైన శివసేన అంటూ చీలిపోయారు. దీంతో ఉద్ధవ్ శివసేన, ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన అంటూ రెండు వర్గాలు చీలిపోయాయి. తాజాగా మళ్లీ.. ఉద్ధవ్ శివసేన చీలిపోతోందన్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి.








