గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సీఎం చంద్రబాబు భేటీ
• ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ఇరువురి చర్చ
• ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
• ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్ సహకారం కోరిన చంద్రబాబు
• రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు ఆధునిక క్లౌడ్ సాంకేతికతల వినియోగంపై చర్చ
• ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో యువతకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదన.
• గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపిన సీఎం చంద్రబాబు.
• విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చ
• గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ విజయాలను వివరించిన సీఎం చంద్రబాబు.
• రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంజీవని ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరిన ముఖ్యమంత్రి








