జీహెచ్ఆర్ ఇన్ఫ్రాకు చెందిన 1,190 హోం రెసిడెన్షియల్ కమ్యూనిటీ
‘జీహెచ్ఆర్ కాలిస్టో’లో తొలి విడత హ్యాండోవర్ల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్, 16 జూన్, 2026: హైదరాబాద్‌లో ప్రీమియం రెసిడెన్షియల్ కమ్యూనిటీల నిర్మాణ సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఆర్ ఇన్ఫ్రా(GHR Infra), పశ్చిమ హైదరాబాద్‌లోని కొల్లూర్‌లో స్మార్ట్ మరియు సస్టైనబుల్ విధానంలో నిర్మించిన తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జీహెచ్ఆర్ కాలిస్టో’లో(GHR Callisto) తొలి విడత (ఫేజ్ 1) ఇళ్ల అప్పగింత ప్రక్రియను ఇవాళ ప్రారంభించింది. పశ్చిమ హైదరాబాద్ పరిధిలోని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఇళ్లను అనుకున్న సమయానికి డెలివరీ చేయడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలిచింది.
ఐజీబీసీ(IGBC) ప్రీ-సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్‌ను దక్కించుకున్న జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్‌ను 8.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో నాలుగు టవర్లు, 11 వెంగ్స్, 2, 2.5, 3, 4 బీహెచ్‌కే విభాగాలలో 1,190 అపార్ట్మెంట్లు ఉన్నాయి. నగరంలోని విస్తరిస్తున్న రెసిడెన్షియల్ మార్కెట్లో ఈ ప్రాజెక్ట్ పరిమాణాన్ని మరియు ప్రాధాన్యతను ఇది మరింత బలోపేతం చేస్తోంది. మొదటి విడత హ్యాండోవర్ అనేది ఈ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు తమ ఇళ్లలోకి మారడానికి ముందే తమ అభిరుచులకు అనుగుణంగా ఫర్నిచర్ పనులు, ఇంటీరియర్ ప్లానింగ్, నచ్చిన మార్పులు (కస్టమైజేషన్) చేసుకునే తదుపరి దశను ప్రారంభించడానికి వీలవుతుంది.
ఈ ఇళ్ల అప్పగింత కార్యక్రమం కొనుగోలుదారులతో ఎంతో ఆత్మీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, డెసిగ్నేటెడ్ పార్ట్నర్, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ కార్తీష్ రెడ్డి మడుగుల హాజరయ్యారు. ఎంపిక చేసిన కొంతమంది కొనుగోలుదారులకు వారే స్వయంగా హ్యాండోవర్ కిట్లను అందజేసి, ఆయా కుటుంబాలకు ఇళ్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఇదొక గుర్తుండిపోయే క్షణంగా మార్చారు. కొత్తగా ఇళ్లు పొందిన వారిలో సంతోషం, నమ్మకం, భావోద్వేగ అనుబంధం కనిపించింది. ఎందుకంటే జీహెచ్ఆర్ కాలిస్టో అనేది కేవలం కొనుగోలు నిర్ణయంగానే కాకుండా.. ఇప్పుడు వారు సొంతం చేసుకోబోయే ఒక ఇల్లుగా మారింది.
ఈ ఇళ్ల అప్పగింత కార్యక్రమం కొనుగోలుదారులలో ఎంతో సంతృప్తిని నింపింది. ఇళ్లు స్వాధీనం చేసుకునే ప్రక్రియ, తమ జీవనశైలికి అనుగుణంగా ఇళ్లను సిద్ధం చేసుకునే అవకాశం లభించడం పట్ల వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చాలా కుటుంబాలకు ఈ హ్యాండోవర్ కిట్‌ను అందుకోవడం అనేది వారి సొంతింటి ప్రయాణంలో ఒక చిరస్మరణీయమైన అడుగుగా నిలిచింది. ఇది జీహెచ్ఆర్ ఇన్ఫ్రా నిర్మాణ గడువుల నిర్వహణపై నమ్మకాన్ని, జీహెచ్ఆర్ కాలిస్టోలో చక్కగా ప్రణాళికబద్ధంగా రూపొందించిన నివాస వాతావరణంపై నమ్మకాన్ని మరింత పెంచింది.
ఈ ప్రాజెక్ట్ ప్రీమియం రెసిడెన్షియల్ విభాగంలో రూపొందింది. ఇందులో అపార్ట్మెంట్ల పరిమాణం 1,195 చదరపు అడుగుల నుండి ప్రారంభమవుతుంది. సాధారణ మోడళ్ల ధరలు దాదాపు రూ. 83 లక్షల నుండి ప్రారంభం అవుతున్నాయి. అద్భుతమైన ప్లానింగ్, విలాసవంతమైన వసతులు మరియు కొల్లూర్ ప్రాంతంలో ఉన్న లొకేషన్ ప్రొఫైల్ వంటివి ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక క్లబ్‌హౌస్, దాదాపు 70 శాతం ఖాళీ స్థలం (ఓపెన్ స్పేస్) ఉన్నాయి. ఇక్కడి వసతుల్లో భాగంగా మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్నాసియం, ఇండోర్ గేమ్స్, మినీ గోల్ఫ్, క్రికెట్ ప్రాక్టీస్ ఫెసిలిటీస్, బాస్కెట్‌బాల్ కోర్ట్, పిల్లల ఆట స్థలాలు (చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్), పెట్ పార్క్, లైబ్రరీ, పార్టీ లాన్స్ మరియు బార్బెక్యూ స్పేస్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ మరియు పర్యావరణ పరిరక్షణ ఫీచర్లయిన ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, వర్షపు నీటి నిల్వ, సేంద్రీయ వ్యర్థాల కంపోస్టింగ్ (ఆర్గానిక్ వేస్ట్ కంపోస్టింగ్), గ్రే వాటర్ ట్రీట్మెంట్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. ఇవన్నీ సౌకర్యవంతమైన, పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలి కోసం మారుతున్న కొనుగోలుదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ కమ్యూనిటీని నిలబెడుతున్నాయి.
నిర్మాణ నాణ్యత పరంగా చూస్తే.. జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవలను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన టీక్యూసెర్ట్ (TQCert) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పర్యవేక్షించింది. అలాగే నిర్మాణంలో ఖచ్చితత్వం, పనితీరు సామర్థ్యం కోసం బిమ్ (BIM) సాంకేతికత ఆధారిత ప్రక్రియలను ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ టీజీ రెరా (TG RERA) నంబర్ P01100004554 కింద నమోదైంది. ఇది కొనుగోలుదారులకు, మార్కెట్ వర్గాలకు ఈ ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది.
కొల్లూర్‌లో వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్‌కు (ORR) ఉన్న కనెక్టివిటీ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రధాన ఉపాధి కేంద్రాలతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సామాజిక మౌలిక సదుపాయాల ప్రాంతాలకు సులభమైన ప్రాప్యతను కలిగి ఉంది. హైదరాబాద్ పశ్చిమ కారిడార్.. పెద్ద కమ్యూనిటీ ఫార్మాట్లు, బలమైన మౌలిక సదుపాయాల అందుబాటు మరియు వృత్తిపరంగా నిర్వహించే నివాస వాతావరణాలను కోరుకునే గృహ కొనుగోలుదారులను నిరంతరం ఆకర్షిస్తున్న ఈ సమయంలో ఈ లొకేషన్ ప్రొఫైల్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
జీహెచ్ఆర్ ఇన్ఫ్రా సీఈఓ కార్తీష్ రెడ్డి మడుగుల మాట్లాడుతూ.. “జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్‌ను పశ్చిమ హైదరాబాద్‌లోని ఇళ్ల కొనుగోలుదారుల కోసం అన్ని రకాల వసతులు, సరైన సమయానికి డెలివరీ, మెరుగైన జీవన ప్రమాణాల కలయికతో ఒక కమ్యూనిటీగా ప్లాన్ చేశాం. తొలి విడత ఇళ్ల అప్పగింత ప్రారంభం కావడం మాకు ఎంతో కీలకమైన క్షణం. ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్ట్‌ను ఇచ్చిన మాట నుండి నిజమైన నివాస అనుభవంగా మారుస్తుంది. అద్భుతమైన డిజైన్, విశాలమైన ఖాళీ స్థలాలు, స్మార్ట్ హోమ్ ఫీచర్లు, పర్యావరణ అనుకూల వ్యవస్థలు మరియు వృత్తిపరంగా నిర్వహించిన నిర్మాణ నాణ్యతతో.. ప్రస్తుత తరం పట్టణ కుటుంబాల అంచనాలకు తగినట్లుగా, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే కమ్యూనిటీలను నిర్మించడంలో మాకు ఉన్న నిబద్ధతను జీహెచ్ఆర్ కాలిస్టో ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.
జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్‌లో తొలి విడత ఇళ్ల అప్పగింతలు ప్రారంభం కావడం అనేది.. సరైన సమయానికి డెలివరీ, భారీ పరిమాణం, పర్యావరణ అనుకూలత, అన్ని రకాల వసతులు ఒకే చోట లభించే ప్రాజెక్ట్‌ల కోసం హైదరాబాద్‌లో ఉన్న విస్తృతమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రత్యేకించి కొల్లూర్ మార్కెట్ విషయానికి వస్తే.. మంచి కనెక్టివిటీ, ప్రణాళికాబద్ధమైన పట్టణ వృద్ధి, సొంత ఇల్లు కొనుగోలు చేసే వారి (ఎండ్-యూజర్) డిమాండ్ కారణంగా, ఈ ప్రాంతం ఎంతో వేగంగా ఒక మంచి నివాస కేంద్రంగా మారుతుందో ఈ మైలురాయి స్పష్టం చేస్తోంది.








