GHR Infra: విల్లా కమ్యూనిటీ త్రివనతో దక్షిణ హైదరాబాద్‌లో ప్రవేశించిన జిహెచ్ఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్,ఇండియా, డిసెంబర్ 18, 2025: హైదరాబాద్ దక్షిణ భాగంలోని అల్మాస్గూడ-తుక్కుగూడ ప్రాంతంలో జిహెచ్ఆర్ ఇన్ఫ్రా తమ సరికొత్త బొటిక్ విల్లా కమ్యూనిటీ ‘జిహెచ్ఆర్ త్రివన’ను ప్రారంభించింది. 5.61 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో కేవలం 52 విల్లాలు మాత్రమే ఉండటం విశేషం. ఈ కమ్యూనిటీ తెలంగాణ రెరా (TG RERA) వద్ద రిజిస్ట్రేషన్ పొందింది. ఇక్కడ 239 చదరపు గజాల విస్తీర్ణంలో 4 BHK మరియు 304 చదరపు గజాల విస్తీర్ణంలో 5 BHK విల్లాలు అందుబాటులో ఉన్నాయి. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు ఐజిబిసి (IGBC) గోల్డ్ ప్రీ-సర్టిఫికేషన్ లక్ష్యంగా నిర్మితమవుతోంది.
దీనిలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్‌హౌస్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, కో-వర్కింగ్ స్పేస్ వంటి వసతులు ఉన్నాయి. అలాగే పికిల్‌బాల్, క్రికెట్ పిచ్, హాఫ్-బాస్కెట్‌బాల్ కోర్ట్ వంటి క్రీడా సౌకర్యాలు కూడా కల్పించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 14కి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిపాదిత ‘ఫోర్త్ సిటీ’, హార్డ్‌వేర్ పార్క్, ఫార్మా సిటీలకు ఇది అత్యంత చేరువలో ఉండటం వల్ల పెట్టుబడికి కూడా ఇది అనువైన ప్రాంతమని సంస్థ తెలిపింది. విల్లా జీవనంలో ప్రశాంతతను, విలాసాన్ని కోరుకునే కుటుంబాల కోసం దీన్ని అందంగా తీర్చిదిద్దామని సీఈఓ కర్తీష్ రెడ్డి, ఎండి శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు.






