Virginia: వర్జీనియాలో రిపబ్లిక్ డే వేడుకలు… పాల్గొన్న ఆటా నాయకులు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్స్ (NCAIA) ఆధ్వర్యంలో వర్జీనియాలోని మనాసాస్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు సంఘం నాయకులు పాల్గొని ఆటా సేవలను, కాన్ఫరెన్స్ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ (DCM) మరియు ఛార్జ్ డి అఫైర్స్ నమ్గ్యా ఖంపా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సెనేటర్ మార్క్ వార్నర్ కార్యాలయం, కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం కార్యాలయం, స్టేట్ సెనేటర్ కన్నన్ కార్యాలయ ప్రతినిధులతో పాటు డెలిగేట్ జె.జె. సింగ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కమ్యూనిటీ నాయకులు బాబు రావు ఆటా అధ్యక్షులు జయంత్ చల్లాను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ అమెరికాలోని 15 లక్షల మంది తెలుగు వారితో పాటు, ఇతర వర్గాలకు సేవలందిస్తున్న అత్యంత ప్రాచీన జాతీయ తెలుగు సంఘాలలో ఆటా ఒకటని పేర్కొన్నారు. సంస్థ చేపడుతున్న పలు సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను వివరించారు.
ఇవి కూడా చదవండి
19వ ఆటా మహాసభలకు ఆహ్వానం
ఈ సందర్భంగా జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న 19వ ఆటా మహాసభల వేడుకలను తెలియజేస్తూ, ఈ వేడుకలకు అందరూ రావాల్సిందిగా జయంత్ చల్లా అందరినీ ఆహ్వానించారు. ఆటా ప్రతినిధి బృందం రాయబారి నమ్గ్యా ఖంపాకు అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేయగా, ఆమె సానుకూలంగా స్పందించడం విశేషం.
ఇవి కూడా చదవండి













