Nabha Natesh: గ్రీన్ అండ్ రెడ్ లెహంగాలో నభా గ్లామర్ ట్రీట్
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో హీరోయిన్లు కూడా దాన్ని వాడుకుంటూ తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోషూట్లను అప్లోడ్ చేసి ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారు.

ఆ లిస్ట్ లో నభా నటేష్(nabha natesh) కూడా ఒకరు. నన్ను దోచుకుందువటే(nannu dochukundhuvate) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తో మంచి హిట్ ను ఖాతాలో వేసుకుంది.

తర్వాత పలు సినిమాలు చేసినా అవేవీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం స్వయంభు(swayambhu) మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న నభా నటేష్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని స్పెషల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి

ఆ ఫోటోల్లో అమ్మడు గ్రీన్ అండ్ రెడ్ కలర్ లెహంగా ధరించి, స్లీవ్ లెస్ అందాలను యూత్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఊపిరాడకుండా చేస్తుండగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.














