India: చేతులెత్తేసిన పాక్…ఇండియా మరో విజయం
టీ20 ప్రపంచకప్‌లో టీమఇండియా(India) వరుసగా మూడో విజయాన్నందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్-ఎ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ (Pakistan)ను మట్టికరిపించింది. మందకొడి పిచ్‌పై టీమఇండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. స్పిన్‌తో బౌలింగ్ దాడిని ఆరంభించిన పాకిస్థాన్ ఓపెనర్ అభిషేక్ ను డకౌట్ చేసింది. తరువాత వచ్చిన తిలక్‌ను బ్యాట్ ఝళిపించకుండా పాక్ బౌలర్లు అడ్డుకోగలిగినా, సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఆపలేకపోయారు. పాక్ బౌలింగ్ పై బ్యాట్ ఝళిపించాడు. దాంతో పరుగుల వరద మొదలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ మొదట 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన పాక్ లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా భారత బౌలర్ల ముందు తలవంచింది. పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. భారత పేసర్ల బౌలింగ్ పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్ లు ఔటయ్యారు. తరువాత కూడా పాక్ భయపెట్టించలేదు. చివరకు ఈ మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాను చిత్తు చేసింది. టి20ల్లో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.













