HIT: హిట్ ఫ్రాంచైజ్ పై శైలేష్ అదిరిపోయే అప్డేట్
టాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్లకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన హిట్ ఫ్రాంచైజ్‌పై డైరెక్టర్ శైలేష్ కొలను (sailesh kolanu) భారీ అప్డేట్ ను ఇచ్చారు. మొత్తం ఏడు భాగాలుగా ఈ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫైనల్ సినిమాలోఇప్పటివరకు వచ్చిన ఆరు పార్ట్స్‌లోని హీరోలందరూ ఒక్కచోట కలసి కథను ముగించనున్నారని తెలిపారు. అవెంజర్స్(Avenzers) స్టైల్లో అన్ని కథలు ఒకే దారిలో కలుస్తాయని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్‌లో మూడు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. హిట్: ది ఫస్ట్ కేస్(hit: the first case) లో విశ్వక్ సేన్(Viswaksen) ప్రధాన పాత్ర పోషించగా, హిట్: ది సెకండ్ కేస్(Hit: the 2nd Case) లో అడివి శేష్(adivi sesh) నటించారు. రీసెంట్ గా వచ్చిన హిట్: ది థర్డ్ కేస్(Hit: the 3rd case) లో నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా నటించాడు. మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందడంతో పాటు, కథా నిర్మాణం, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌కు ప్రశంసలు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక హిట్4(hit4)లో తమిళ స్టార్ కార్తీ(karthi) నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శైలేష్ కొలను, శ్రీకాంత్(srikanth) కొడుకు మేక రోషన్(Meka roshan)తో ఏమో ఏమో ఇది(emo emo idi) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా అయిపోయిన వెంటనే హిట్4 సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వాల్ పోస్టర్ సినిమాస్(wall poster cinemas) బ్యానర్లో నాని రూపొందిస్తున్న ఈ ఫ్రాంచైజ్‌కు భవిష్యత్‌లో మరింత భారీ స్థాయి ఏర్పడనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













