Swayambhu: రెండు పార్టులుగా స్వయంభు.. టాలీవుడ్లో కొత్త ఫ్రాంచైజ్ ప్లాన్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(nikhil siddharth) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభు(swayambhu) టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిఖిల్ సరసన సంయుక్త మీనన్(Samyuktha menon), నభా నటేష్(nabha natesh) హీరోయిన్లుగా నటిస్తుండగా, రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచింది. భారీ సెట్లు, విస్తృతమైన యాక్షన్ సన్నివేశాలు, యోధుడి పాత్రలో నిఖిల్ కనిపించిన తీరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సమ్మర్ కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని నిఖిల్ అధికారికంగా ప్రకటించడం విశేషం.

డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి(Bharath krishnamachari) అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను విజువల్ వండర్‌గా మలుస్తున్నారు. రవి బస్రూర్(ravi basrur) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్(Senthil kumar) గ్రాండియర్ విజువల్స్‌తో సినిమాకు ప్రత్యేక శోభను తీసుకురానున్నారు. ఠాగూర్ మధు(Tagore madhu) సమర్పణలో భువన్(bhuvan), శ్రీకర్(Srikar) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌ను టార్గెట్ చేస్తోంది. టీజర్ ద్వారా సినిమాకి పాన్ ఇండియా టోన్ ఇవ్వాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
కార్తికేయ 2(Karthikeya2) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నిఖిల్‌కు ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. 18 పేజెస్(18 pages) పరవాలేదనిపించగా, స్పై(spy), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo) సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో స్వయంభును నిఖిల్ కెరీర్‌కు కీలక మలుపుగా భావిస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో కొత్త ఫ్రాంచైజ్ ప్లాన్ విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలో, స్వయంభు కూడా మరో భారీ ఫ్రాంచైజ్‌గా నిలుస్తుందా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
ఇవి కూడా చదవండి













