NTR-Neel మూవీకి కళ్ళు చెదిరే OTT డీల్ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్ దక్కించుకుందంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా, ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(Dragon) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జోర్డాన్‌లో శరవేగంగా సాగుతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. తారక్ స్టైలిష్ లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.
ఇదిలా ఉంటే, ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో రికార్డు స్థాయి డీల్ కుదిరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.125 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందం థియేట్రికల్ రన్ తో లింక్ అయి ఉందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సుమారు రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తేనే పూర్తి మొత్తాన్ని చెల్లించే విధంగా డీల్ కుదిరినట్టు టాక్. అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తే అదనపు చెల్లింపుల అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్(rukmini vasanth) హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని(naveen yerneni), వై. రవిశంకర్(Y. Ravi shankar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్(Ravi basrur) ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి టాలీవుడ్ లోనే అతి పెద్ద ఓటీటీ డీల్ సాధించిన మూవీగా డ్రాగన్ నిలవనుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి













