TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ (TATA) పికిల్‌బాల్ టోర్నమెంట్
TATA: ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA NC) తన 35 ఏళ్ల ప్రస్థానంలో భాగంగా ఫిబ్రవరి 28వ తేదీన భారీ పికిల్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఎపెక్స్లోని ‘పీక్ స్పోర్ట్స్’ (Peak Sports) వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి.
ముఖ్య నిర్వహకులు (Board of Directors – 2026):
ఈ టోర్నమెంట్‌ను 2026 కార్యవర్గ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
- అధ్యక్షులు: వినోద్ కుమార్ కట్రగుంట
- ఉపాధ్యక్షులు, TLA: నాగ గొంధి
- సెక్రటరీ: వెంకట్ కోగంటి
- కోశాధికారి,మహిళా విభాగం: హేమ దాసరి
- జాయింట్ సెక్రటరీ, తెలుగు బడి: సాయి మహేష్ గడ్డంశెట్టి
- స్పోర్ట్స్: వెంకట నరేష్ మొక్క
- మెంబర్షిప్: ప్రవీణ్ పెద్ది
- ఫుడ్, లాజిస్టిక్స్: సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి
- లాజిస్టిక్స్, చేయూత: భూమేష్ గండే
- కల్చరల్, సాహిత్య వేదిక: శివ బోనగిరి
- టాటా యువ: గణేష్ మంత్రిప్రగడ
పోటీల వివరాలు:
ఈ టోర్నమెంట్లో మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం.
రిజిస్ట్రేషన్:
ఫీజు: TATA సభ్యులకు $15, సభ్యులు కాని వారికి $20.
సంప్రదించడం: క్రీడల నిర్వహకుడు నరేష్ మొక్క (848-256-5272) ద్వారా లేదా ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తెలుగు వారందరూ ఈ క్రీడా సంబరంలో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ కోరుతోంది.













