IND vs Pak: ఇండియా వర్సెస్ పాక్ వర్సెస్ వర్షం..?
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో తెలియని పిచ్చి ఉంటుంది. ఒకప్పుడు దీనిని క్రేజ్ అన్నప్పటికీ ఇప్పుడు అది పిచ్చిగా మారిపోయింది. పాకిస్తాన్(Pakistan) విషయంలో భారతీయుల్లో కోపం ఉండటం కూడా ఈ మ్యాచ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. టి20 వరల్డ్ కప్(T20 World Cup) లో ఈ రెండు జట్లు తలపడునున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే భారీ ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. అసలు ఈ రెండు జట్లు ఆడతాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొన్న సమయంలో ఐసీసీ రంగంలోకి దిగి పరిస్థితిని చెక్క దిద్దిన సంగతి తెలిసిందే. చివరకు రెండు జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గ్రూప్ మ్యాచ్ ఆడనున్నాయి.
అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. దీనికి కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. దీనివల్ల కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి అక్కడ వర్షం పడే సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికే మైదానంలో టికెట్లు భారీగా అమ్ముడు పోగా మ్యాచ్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వర్షం వార్త మరింత ఇబ్బంది పెడుతోంది. అయితే ఐదు గంటల వరకు వర్షం కురిసినప్పటికీ ఆ తర్వాత పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనీ శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితి వస్తే మరో రోజు మ్యాచ్ నిర్వహించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ తో పాటుగా ఐసిసి కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ రద్దు అయితే దాదాపుగా 4,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ నిర్వహణ విషయంలో ఐసీసీ అంతగా పట్టుబట్టింది. అటు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును హెచ్చరించిన పరిస్థితి. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే శ్రీలంక కూడా భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ బోర్డుతో పాటుగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా భారీగా నష్టపోయే సంకేతాలు ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి













