Pakistan: అమెరికాకు పాకిస్తాన్ టిష్యూ పేపరా..?
అగ్రరాజ్యం అమెరికా తీరుపై పాకిస్తాన్ నేతలు, మంత్రులు ఇటీవలి కాలంలో ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తాము అమెరికాకు చేసిన సాయానికి.. సరైన ప్రతిఫలాన్ని అమెరికా ఇవ్వలేదన్నట్లు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకూ వెళ్లిందంటే… ఆఫ్గనిస్తాన్ విషయంలో తమ దేశాన్ని అమెరికా టిష్యూ పేపర్ లా వాడుకుని వదిలేసిందన్నారు పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో జాతీయ భద్రత, ఉగ్రవాదంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గతంలో తమ దేశం అనుసరించిన విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
“మేం ఇస్లాంను రక్షించడానికి గానీ, జిహాద్ కోసం గానీ ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాల్గొనలేదు. కేవలం అమెరికా వంటి అగ్రరాజ్యం మద్దతు, రాజకీయ ప్రాబల్యం సంపాదించడానికే ఆ యుద్ధాల్లో భాగమయ్యాం” అని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. 9/11 దాడుల తర్వాత రెండు దశాబ్దాల పాటు కేవలం అమెరికా మద్దతు కోసమే పాకిస్థాన్‌ను తాకట్టు పెట్టారని ఆయన అంగీకరించారు. ఈ విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
గత సైనిక పాలకులైన జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్‌లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చాయని ఆయన ఆరోపించారు. సోవియట్ యూనియన్ విషయంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, అమెరికా విషయంలోనూ అవే తప్పులను పునరావృతం చేశామని విమర్శించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయడానికి దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి













