RC17: ఇద్దరు భామలతో చరణ్ రొమాన్స్?
RRRతో గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ సంపాదించిన రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం తన తర్వాతి సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్(game changer) నిరాశ కలిగించిన తర్వాత ఆయన ఆశలన్నీ పెద్ది(peddi)పై ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశమవుతోంది RC17 ప్రాజెక్ట్. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటనతోనే ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది.
ఇవి కూడా చదవండి
తాజా సమాచారం ప్రకారం RC17లో ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకోసం మేకర్స్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran), రుక్మిణి వసంత్(rukmini vasanth) పేర్లను పరిశీలిస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో రంగస్థలం సమయంలో అనుపమ పేరు పరిశీలనలోకి వచ్చినా అప్పుడు ఆమెకు అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం అదే కాంబినేషన్లో ఆమెకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్త యూత్‌లో ఆసక్తి రేపుతోంది. నేచురల్ యాక్టింగ్ తో గుర్తింపు పొందిన అనుపమకు ఇది కెరీర్లో కీలక మలుపు కావొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు సప్తసాగరాలు దాటి(Sapta sagaralu daati) మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎంపికయ్యే అవకాశముందని ప్రచారం సాగుతోంది. పుష్ప2(pushpa2) తర్వాత సుకుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో చరణ్ ఇద్దరు హీరోయిన్లతో కనిపించనున్నాడన్న వార్త సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. మరి ఈ సారి చరణ్- సుకుమార్ కలిసి రంగస్థలం మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.













