Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం…!
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జమాత్-ఏ ఇస్లామీ కేవలం 70 సీట్లకు పరిమితమైంది. ముఖ్యంగా జమాత్ -ఏ -ఇస్లామీ అతివాదాన్ని ప్రజలు దూరం పెట్టారని చెప్పాలి.
మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో బీఎన్పీ నేత తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్‌ను బీఎన్పీ దాటేసింది. ఇక, ఈ ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఈ రెండుచోట్ల కూడా ఆయన విజయం సాధించారు.
బంగ్లాదేశ్ గెలిస్తే పొరుగుదేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటామని ఇప్పటికే తారిఖ్ స్పష్టం చేశారు . దీంతో తారిఖ్ విజయం భారత్ కు.. శుభసూచకంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఎన్నికలకు ముందు తారిఖ్, ఇండియా మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రహ్మాన్ తల్లి ఖాలిదా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని రహ్మాన్ పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి













