Municipal Election: అందోల్ – జోగిపేటలో కాంగ్రెస్, ఇంద్రేశం, అయిజలలో బీఆర్ఎస్ హవా .. రసవత్తరంగా ఫలితాలు
సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంటూ పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
ఇంద్రేశం మున్సిపాలిటీ (సంగారెడ్డి): ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. మొత్తం వార్డుల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఇంద్రేశం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ వశమైంది.
ఇవి కూడా చదవండి
కోహీర్ మున్సిపాలిటీ (సంగారెడ్డి): కోహీర్లో ఫలితాలు ‘హాంగ్’ కు దారితీశాయి. మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 5 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ (9 సీట్లు) రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
అయిజ మున్సిపాలిటీ (గద్వాల): జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 20 వార్డులకు గాను 14 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, కాంగ్రెస్ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో 5 వార్డుల్లో కాంగ్రెస్ గెలివగా.. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది.













