Anil Ravipudi: పటాస్ ఇచ్చిన హై ఏ సినిమా ఇవ్వలేదు
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు అనిల్ రావిపూడి(Anil ravipudi). కెరీర్ మొదలుపెట్టిన పటాస్(patas) నుంచి రీసెంట్ గా చేసిన మన శంకరవరప్రసాద్ గారు(Mana shankara varaprasad Garu) వరకు అనిల్ ప్రతీ సినిమాతోనూ బ్లాక్ బస్టర్ ను అందుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ నుంచి సినిమా వస్తుందంటే మరో హిట్ మూవీ రాబోతుందని అందరికీ నమ్మకం కలిగింది.
ఇవి కూడా చదవండి
అయితే ఇప్పటివరకు అనిల్ నుంచి 9 సినిమాలు రాగా, అందులో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. వరుస సక్సెస్ లతో కెరీర్లో దూసుకెళ్తునన అనిల్ తనకు ఈ తొమ్మిది సినిమాల సక్సెస్ల్లో ఏ మూవీ సక్సె తనకు ఎక్కువ హై ఇచ్చిందో అనిల్ రీసెంట్ గా తెలిపారు. అనిల్ బెస్ట్ ఫ్రెండ్ సాయి కృష్ణ(Sai krishna) డైరెక్టర్ గా మారి చేస్తున్న హై(High) సినిమా టీజర్ లాంచ్ లో అనిల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
తనకు ఇప్పటివరకు అన్ని సక్సెస్ లలో హై ఇచ్చిన మూవీ పటాసే అని, ఆ తర్వాత సినిమాలన్నీ తాను దిన దినగండంగానే చేశానని, పటాస్ తర్వాత ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు తాను భయపడుతూనే ఉంటానని, సినిమా రిలీజయ్యాక హమ్మయ్యా బయటపడిపోయా అనుకుంటానని చెప్పారు అనిల్. దీంతో కెరీర్ ను మార్చిన పటాస్ అనిల్ కు ఎప్పటికీ స్పెషలే అనే విషయం అర్థమైంది.
ఇవి కూడా చదవండి













