Madhira: ఇక్కడ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ గెలవలేదు..
Madhira: ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. మొత్తం 22 వార్డులకు గాను, మొదటి రౌండ్లో లెక్కింపు చేపట్టిన 11 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కనీసం ఒక్క వార్డులో కూడా ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదటి రౌండ్ విజేతల వివరాలు:
మొదటి రౌండ్లో భాగంగా 11 వార్డుల ఫలితాలు వెల్లడి కాగా, అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. విజేతల జాబితా ఇక్కడ ఉంది:
- 1వ వార్డు: దోర్నాల శిరీష (కాంగ్రెస్)
- 2వ వార్డు: బాణావత్ వెంకట రమణ (కాంగ్రెస్)
- 3వ వార్డు: బెజ్జం రాజు (కాంగ్రెస్)
- 4వ వార్డు: సామినేని సుజాత (కాంగ్రెస్)
- 5వ వార్డు: పిల్లి సునీత (కాంగ్రెస్)
- 6వ వార్డు: వేమిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్)
- 7వ వార్డు: శీలం నర్సిరెడ్డి (కాంగ్రెస్)
- 8వ వార్డు: యన్నం కోటేశ్వరరావు (కాంగ్రెస్)
- 9వ వార్డు: ఎర్రందాసు చారులత (కాంగ్రెస్)
- 10వ వార్డు: బోడెపూడి రేవతి (కాంగ్రెస్ కూటమి)
- 11వ వార్డు: గద్దల మాధురి (కాంగ్రెస్)
మధిరలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కట్టారని నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













