UPI సేవలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ నెల నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఇకపై UPI ట్రాన్సాక్షన్ 10 సెకండ్లలో పూర్తవ్వాలి. ముందు ఇది 30 సెకండ్లు పట్టేది, ఇప్పుడు వేగం పెరగనుంది.
పీక్ టైమ్‌లో కూడా లావాదేవీలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్లకు కఠినమైన వెరిఫికేషన్ విధానం అమల్లో ఉంటుంది.
పేమెంట్ చేసే ముందు యూజర్ స్పష్టంగా అంగీకారం తెలపాలి. ఆటో డెడక్షన్‌లను కూడా యూజర్లు నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.
చాలా కాలంగా వాడని యూపీఐ ఐడీలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. మళ్లీ వాడాలంటే రీ వెరిఫికేషన్ తప్పనిసరి.
పేమెంట్ ఫెయిల్ అయినా డబ్బు కట్ అయినా కొన్ని గంటల్లోనే రీఫండ్ రావాలి. UPI యాప్స్, బ్యాంకులు సమస్య పరిష్కారానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది
అనుమానాస్పద లావాదేవీలపై రియల్‌టైమ్ అలర్ట్‌లు పంపిస్తారు.
రోజువారీ ట్రాన్సాక్షన్ పరిమితులపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది.
మోసాల నివారణకు ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలను బలోపేతం చేస్తారు.