MATA: 2వ మాటా కన్వెన్షన్ 2026 సన్నాహక వేడుకలు ఘనంగా ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) తన రెండవ మహాసభల కోసం నగారా మోగించింది. గ్రేటర్ ఫిలడెల్ఫియాలో నిర్వహించిన గ్రాండ్ కిక్ ఆఫ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఏకత, సంస్కృతి, సేవా దృక్పథం ప్రతిబింబించేలా సాగిన ఈ సాయంత్రం తెలుగు వారి ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
కన్వెన్షన్ వివరాలు, వేదిక
ముఖ్యమైన తేదీలు: జూన్ 19 నుండి 20 వరకు, 2026
ప్రధాన వేదిక: గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్, ఓక్స్, పెన్సిల్వేనియా
కిక్ ఆఫ్ వేదిక: బ్లూ రోజ్ ఈవెంట్ సెంటర్, మాల్వెర్న్, పెన్సిల్వేనియా
ఇవి కూడా చదవండి
కార్యక్రమ విశేషాలు, కమ్యూనిటీ మద్దతు
తీవ్రమైన చలి గాలులను సైతం లెక్కచేయకుండా 400 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇది మన తెలుగు సమాజం అంకితభావాన్ని చాటిచెప్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అలాగే 2026 కన్వెన్షన్ అధికారిక ప్రమోషనల్ వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
విరాళాలు, స్పాన్సర్ షిప్ ల ద్వారా భారీ స్పందన
MATA నాయకత్వంపై ఉన్న నమ్మకంతో దాతలు, స్పాన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పావు మిలియన్ డాలర్లకు పైగా విరాళాల హామీలు లభించడం ఈ కన్వెన్షన్ విజయంపై ఉన్న నమ్మకాన్ని బలపరిచింది.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులకు మాటా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
మాటా వ్యవస్థాపకులు: శ్రీనివాస్ గణగోని
అధ్యక్షులు: రమణ కృష్ణ కిరణ్ దుద్ధగి
ఖజాంచి మరియు కన్వీనర్: శ్రీధర్ గుడాల
ఈవీపీ: ప్రవీణ్ గుడూరు
సంయుక్త కార్యదర్శి: విజయ్ భాస్కర్ కలాల్
డైరెక్టర్లు: కల్యాణి (కమ్యూనిటీ సర్వీసెస్), సిరీష (ఆధ్యాత్మికం), సురేష్ కాజానా (స్పోర్ట్స్)
ఇవి కూడా చదవండి
బోర్డు సభ్యులు మల్లిక్ బొల్ల, బాబా సొంట్యానా, ప్రాంతీయ వీసీపీలు, ఆర్ సీలు, స్టాండింగ్ కమిటీలు, వాలంటీర్ల కృషిని సంస్థ కొనియాడింది. సమాజ నాయకులు రవి పొట్లూరి, రామ్ మోహన్ తాళ్లూరి, సురేష్ బొండుగుల, సురేష్ రెడ్డి, రమణ కొంథా, సత్య రెడ్డి, రెహ్మాన్, పవన్, కమల్ తదితరుల మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భవిష్యత్ లక్ష్యం
ఫిలడెల్ఫియా, న్యూ జెర్సీ, డెలావేర్, న్యూ యార్క్, హారిస్ బర్గ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మాటా చాప్టర్లు ఏకతా భావంతో మద్దతు ప్రకటించాయి. 2026లో జరగబోయే ఈ రెండవ మాటా కన్వెన్షన్ ఉత్తర అమెరికా తెలుగు సమాజం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే విలువలతో మనమందరం కలిసి ఈ వేడుకను జరుపుకుందాం.
ఇవి కూడా చదవండి
For more Photos click here













