Imanvi: మరోసారి వార్తల్లోకి ఫౌజీ బ్యూటీ
సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇమాన్వీ(Imanvi esmail) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా, హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(Fauzi) సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా నుంచి సినిమాల దాకా వచ్చిన ఈ బ్యూటీకి ఇది కెరీర్లో కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, ఇమాన్వీ మళ్లీ తన ప్యాషన్ అయిన డ్యాన్స్ వైపు దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా దురంధర్(Durandhar) సినిమాలోని టైటిల్ సాంగ్‌కు ఆమె చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన స్టైల్, ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీతో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఇమాన్వీ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఆమె క్రేజ్‌ను మరింత పెంచుతోంది. ఫ్యాన్స్ కూడా ఆమె వీడియోలను షేర్ చేస్తూ భారీగా స్పందిస్తున్నారు.

ఇక ఈ రీల్ వీడియోలు ఫౌజీ సినిమాకు పరోక్షంగా ఫ్రీ పబ్లిసిటీ తీసుకురావడం విశేషం. సినిమా రిలీజ్‌కు ముందే హీరోయిన్‌కు మంచి గుర్తింపు ఏర్పడటం ఫౌజీకి ప్లస్‌గా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే బలమైన ప్రెజెన్స్ ఉన్న ఇమాన్వీ, సినిమా విడుదల సమయానికి మరింత హైప్ క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, డ్యాన్స్ రీల్స్‌తో ఇమాన్వీ మరోసారి వార్తల్లో నిలుస్తూ ఫౌజీపై అంచనాలను పెంచుతోంది.













