Raja Saab: ఏదొకటి క్లారిటీ ఇవ్వండి రాజా సాబ్
ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్(The Raja Saab). హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మాళవికా మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhhi Agerwal), రిద్ది కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకుని రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ షూటింగ్ లేటవడం వల్ల సినిమా ఇప్పుడు వాయిదా తప్పడం లేదని అందరికీ అర్థమైంది. అయినా ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి క్లారిటీ లేకుండా రాజా సాబ్ టీమ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. త్వరగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయమని అభిమానులు నిర్మాణ సంస్థను కోరుతున్నారు. దీంతో మేకర్స్ రాజా సాబ్ కోసం మంచి రిలీజ్ డేట్ ను వెతికే పనిలో పడ్డారట.
పోటీ లేకుండా సోలో డేట్ అయితే బావుంటుందని భావిస్తున్న నిర్మాతల చూపు దసరా మీద ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికే సెప్టెంబర్ 25న అఖండ2(AKhanda2), సంబరాల ఏటిగట్టు(Sambarala yeti gattu) సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. దసరాకు సెప్టెంబర్ 25కి వారం రోజులే గ్యాప్ ఉంది. కాబట్టి ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన రాజా సాబ్ కు అనుకున్న మొత్తంలో థియేటర్లు దక్కవు. దానికితోడు అక్టోబర్ 2న కాంతార చాప్టర్1(kanthaara chapter1) రిలీజ్ కానుంది. పోనీ ఆగస్ట్ లో వద్దామంటే వార్2(War2) వస్తుంది. వీటన్నింటినీ చూస్తుంటే రాజా సాబ్ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఏదొక నిర్ణయాన్ని త్వరగా తీసుకుని అనౌన్స్ చేయడం బెటర్.













