Artificial Intelligence: రాబోయే 18 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్‌కు ఏఐ చెక్ పెట్టేస్తుంది!
కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) విప్లవం గురించి మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగ అధిపతి ముస్తఫా సులేమాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై ఆయన చేసిన తాజా హెచ్చరికలు కార్పొరేట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘వైట్ కాలర్’ (White Collar) ఉద్యోగాలపై ఏఐ (Artificial Intelligence) ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎప్పుడో సుదూర భవిష్యత్తులో జరిగే మార్పు కాదని, కేవలం రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే ఈ పరిణామాలు చూడబోతున్నామని ఆయన బాంబు పేల్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముస్తఫా సులేమాన్ విశ్లేషణ ప్రకారం.. ప్రధానంగా న్యాయ వ్యవస్థ (Legal), అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో మనుషులు చేసే పనులను ఏఐ (Artificial Intelligence) టూల్స్ ఆక్రమించనున్నాయి. నివేదికలను రూపొందించడం, క్లిష్టమైన డేటాను విశ్లేషించడం, ఒప్పంద పత్రాలను (Contracts) పరిశీలించడం వంటి పనులను ఏఐ అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేస్తుందని ఆయన వివరించారు. దీనివల్ల కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయించుకోవడానికి ఏఐ (Artificial Intelligence) వైపే మొగ్గు చూపుతాయని తెలిపారు. ఇది కేవలం ఆర్భాటం కోసం చెబుతున్న మాటలు కావని, వాస్తవ రూపం దాల్చుతున్న సాంకేతిక విప్లవమని ఆయన తేల్చిచెప్పారు. రోజువారీ ఆఫీసు పనులు ఆటోమేట్ అవ్వడం వల్ల ఉద్యోగాల కోత తప్పదన్న సంకేతాలను ఆయన పరోక్షంగా ఇచ్చారు.













