Vote Counting: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు!
Vote Counting: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
కౌంటింగ్ ప్రక్రియ ఇలా:
తొలుత అధికారుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 136 కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల నిఘాలో పారదర్శకంగా లెక్కింపు నిర్వహిస్తున్నారు.
కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల లెక్కింపు ఒకేసారి మొదలవ్వగా, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రౌండ్ల పద్ధతిలో ఫలితాలను ప్రకటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారీ భద్రత – వెబ్ కాస్టింగ్:
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల లోపల, బయట ఏం జరుగుతుందో తెలుసుకునేలా వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
ఇవి కూడా చదవండి
రాజకీయ ఉత్కంఠ:
తమ అభ్యర్థుల భవితవ్యంపై అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్, చైర్పర్సన్ పీఠాలను ఏ పార్టీ దక్కించుకుంటుందనే అంశంపై ఇప్పటికే బెట్టింగ్లు జోరందుకున్నాయి. మధ్యాహ్నం నుంచి ట్రెండ్స్ మొదలై, సాయంత్రానికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













