Piyush Goyal: భారత్-అమెరికా డీల్‌పై రాహుల్ ఆరోపణలు అవాస్తవం: పియూష్ గోయల్
అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై పార్లమెంటులో రేగిన దుమారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్‌కు దక్కిన ప్రయోజనాలు భారత్‌కు దక్కలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) తీవ్రంగా ఖండించారు. సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వస్త్ర ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్‌కు లభిస్తున్న వెసులుబాటు భారత్‌కు కూడా యథాతథంగా వర్తిస్తుందని ఆయన వివరించారు. ఒప్పందం ప్రకారం, అమెరికా నుండి పత్తి లేదా ఇతర ముడి పదార్థాలను కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్ చేసి వస్త్రాలుగా మార్చి తిరిగి అమెరికాకు ఎగుమతి చేస్తే, ఎటువంటి పన్నులు ఉండవని (Zero Reciprocal Tariff) గోయల్ స్పష్టం చేశారు. వాస్తవానికి అమెరికాతో బంగ్లాదేశ్ కంటే భారత్ మరింత మెరుగైన, సమగ్రమైన డీల్ కుదుర్చుకుందని ఆయన (Piyush Goyal) తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు ఈ ఒప్పందానికి సంబంధించి వైట్ హౌస్ విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ షీట్’లో జరిగిన సవరణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కూడా స్పందించింది. అమెరికా చేసిన సవరణలు ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర అవగాహనను, స్నేహాన్ని ప్రతిబింబిస్తున్నాయని విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.













