Supreme Court: రెరా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రద్దు చేయడమే మేలు!
సామాన్యుడి సొంతింటి కలను నిజం చేయడంలో, మోసపూరిత బిల్డర్ల నుండి రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషించాల్సిన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (RERA) పనితీరుపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిప్పులు చెరిగింది. గురువారం జరిగిన ఒక కేసు విచారణలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. రెరా సంస్థలు ప్రస్తుతం తమ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి, కేవలం తప్పులు చేసిన బిల్డర్లకు రక్షణ కవచంలా మారాయని, బాధితులకు న్యాయం చేయడం లేదని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలు ప్రజలకు ఉపయోగపడనప్పుడు, వాటిని పూర్తిగా రద్దు చేయడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి
హిమాచల్ ప్రదేశ్ రెరా కార్యాలయాన్ని రాజధాని సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీనిపై అక్కడి హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రెరా చట్టం అసలు ఎందుకు తెచ్చారో, దేనికోసం ఈ అథారిటీలను ఏర్పాటు చేశారో రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు హితవు పలికింది. కేవలం బిల్డర్ల సౌకర్యార్థమే ఇవి పనిచేస్తున్నాయన్న భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక ఈ కేసు విషయానికి వస్తే, పరిపాలనా సౌలభ్యం కోసం కార్యాలయాలను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేస్తూ, హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు (Supreme Court) పక్కన పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ రెరా కార్యాలయం, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. సామాన్యుల పక్షాన నిలబడాల్సిన వ్యవస్థలు, బడా బాబులకే వత్తాసు పలకడంపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ఇవి కూడా చదవండి













