Funky Review: ‘ఫంకీ’ గలీజుగుంది భై!
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నటీనటులు : విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, కళా దర్శకుడు: జానీ షేక్
రచన: అనుదీప్ కె.వి, మోహన్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
విడుదల తేది : 13.02.2026
నిడివి :2 ఘంటల 08 నిముషాలు
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం `ఫంకీ`(FUNKY). విశ్వక్ సేన్, (Vishwak Senk)కయాదు లోహర్(Kayadu Lohar) జంటగా నటించిన ఈ చిత్రానికి `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ (Anudeep) దర్శకుడు. విశ్వక్ సేన్‌కి గత కొన్ని రోజులుగా సక్సెస్ లేవు. అనుదీప్ కూడా చివరి చిత్రంతో డిజప్పాయింట్ చేశారు. వీరికిద్దరికి హిట్ కావాలి. ఈ క్రమంలో వీరంతా ఇప్పుడు `ఫంకీ` చిత్రంతో వస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యిందా? విశ్వక్, అనుదీప్‌లకు హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీని ప్రేమికుల రోజుని పురస్కరించుకుని శుక్రవారం(ఫిబ్రవరి 13న) విడుదల అయ్యింది. సినిమా ఎలా వుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ ఇది. కోమల్ (విశ్వక్ సేన్) సినిమా దర్శకుడు. నిర్మాత సుదర్శన్(నరేష్) బ్యానర్లో మూవీ చేస్తుంటాడు. నాలుగు కోట్ల బడ్జెట్ అని చెప్పి రూ.40కోట్లు చేస్తాడు. అది తట్టుకోలేక మంచాన పడతాడు నిర్మాత. అనుకున్న దానికంటే బడ్జెట్ పెంచేయడంతో అవకాశం ఇచ్చిన నిర్మాత అనారోగ్యపాలవుతాడు. తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన కోమల్‌పై నిర్మాత కూతురు చిత్ర(కయాదు లోహర్)కి చెప్పలేనంత కోపం వస్తుంది. కోమల్ని దర్శకుడిగా తీసేస్తుంది. సినిమా ఆపేస్తుంది. దీంతో కోమల్ బ్రతిమాలుకుంటాడు. కోటీ రూపాయల్లో సినిమాని కంప్లీట్ చేస్తానని ఒప్పుకుంటాడు. ఇక ఎలాగొలా చిత్ర కోపాన్ని తగ్గించి సినిమాలు మళ్లీ మొదలుపెట్టాలని కోమల్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు.
ఇవి కూడా చదవండి
ఓ దశలో చిత్ర ఒప్పుకుంటుంది. చిత్ర ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతుంది. మిగిలిన సినిమాను తాను చెబుతున్న బడ్జెట్లో కాకుండా కేవలం కోటి రూపాయల్లో పూర్తి చేయాలనే షరతుతో సినిమాను మళ్లీ మొదలు పెడుతుంది చిత్ర. ఈ ప్రయాణంలో కోమల్, చిత్ర మధ్య ప్రేమ చిగురిస్తుంది. దీంతో ఇక కఠినంగా మూవీని పూర్తి చేసే పని పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? కోమల్ సినిమాని పూర్తి చేయడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఆయనతో చిత్ర సినిమా పూర్తి చేసిందా? ఇందులో దిల్ రాజు, నాగవంశీ, అనుదీప్ పాత్రలేంటి? జీకే(సంపత్ రాజ్) వీరిని ఎందుకు టార్గెట్ చేశారు? సినిమా షూటింగ్ చేసే సమయంలో చోటు చేసుకున్న ఫన్నీసంఘటనలు ఏంటి? సినిమాలో దర్శకుడికి సంబంధించి చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటనేది సినిమా.
నటీనటుల హవబావాలు :
దర్శకుడు కోమల్ పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. చాలా సెటిల్డ్ గా చేశాడు. కామెడీ డైలాగ్స్ బాగా చెప్పాడు. కానీ చాలా చోట్ల నవ్వు రాలేదు. కాకపోతే నటుడిగా విశ్వక్ ఇరగదీశాడు. హీరోయిన్ కయాదు లోహర్ బాగా చేసింది. గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. ఆమెనే చూస్తూ ఉండిపోయేలా ఉంది. ఇక నిర్మాత పాత్రలో నరేష్ తనదైన కామెడీతో మెప్పించారు. కాకపోతే ఆయన కామెడీని సరిగా వాడుకోలేదు. సంపత్ రాజ్పాత్ర ఇరికించినట్టుగానే ఉంది. కానీ బాగుంది. మురళీధర్ గౌడ్ కనిపించిన కాసేపు నవ్వించాడు. విశ్వక్ తల్లిగా ఈశ్వరీరావు బాగా చేసింది. ఆమె పాత్రలో ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది. విశ్వక్సేన్ చుట్టూ ఉండే కుర్రాళ్లు కూడా అదరగొట్టారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
కె.వి.అనుదీప్ సినిమా నేపథ్యంలో కూడిన కామెడీ ఎంటర్టైనర్గా ఈ కథ రాసుకున్నాడు. `జాతిరత్నాలు` మంచి విజయం సాధించింది. అందులో పెద్దగా కథ లేకపోయినా సందర్భానుసారంగా వచ్చే కామెడీ నవ్విస్తుంది. అది పెద్ద హిట్ అయ్యింది. మధ్యలో `ప్రిన్స్` బెడిసి కొట్టింది. ఇప్పుడు మళ్లీ తన మార్క్ కామెడీతో ‘ఫంకీ‘ మూవీని రూపొందించారు అనుదీప్. మరి ఈ చిత్రం ‘జాతిరత్నాలు’ రేంజ్లో ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. కథలో ఇంకాస్త సీరియస్‌నెస్ ఉంటే బావుండేది. కథ ఆద్యంతం లైటర్‌వేలో సాగింది. కథలో సంఘర్షణలు తక్కువ. అక్కడక్కడ హీరోకు ఎదురయ్యే సమస్యలను కూడా కామెడీగా సాగాయి. మొత్తంగా ఆడియన్స్‌ని నవ్వించే విషయంలో కొంతమేర కె.వి.అనుదీప్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. భీమ్స్ సిసిరోలియో సంగీతం బావుంది. కెమెరా వర్క్ డల్‌గా అనిపించింది. కలర్ గ్రేడింగ్ సరిగ్గా చేస్తే బావుండేది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
విశ్లేషణ:
సినిమాలో కథ లేదు, సీన్ల బేస్డ్ గా సినిమాని నడిపించారు. డైలాగ్ కామెడీతో మూవీని రన్ చేశారు. హీరో తన టీమ్‌తో వేసే సెటైర్లు, డైలాగ్‌లే మూవీ. వాటిని కామెడీగా రాసుకున్నారు. మూవీ మొత్తం అదే ఉంటుంది. ప్రారంభంలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు టామ్ అండ్ జెర్రీలా సాగుతాయి. హీరో ఫ్రస్టేషన్ దాన్ని తన టీమ్‌తో తీర్చుకోవడం, నిర్మాత ముందు ఒకలా, ఆమె లేనప్పుడు మరోలా మాట్లాడటం నవ్వులు పూయించేలా ఉంటుంది. ఈ క్రమంలో అతను రెంట్ కట్టలేని పరిస్థితులు ఆవిష్కరించారు. కొన్ని సీన్లు ఇతర సీన్ల నుంచి కాపీ కొట్టడం, ఇలాంటివి సినిమాల్లో జరిగే వాస్తవ పరిస్థితులను అద్దం పడుతుంది. దర్శకుడి జీవితం ఎలా ఉంటుందనేది చూపిస్తూనే, దాన్ని ఫన్నీ వేలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా ఇలా సరదాగా సాగిపోతుంది.
సెకండాఫ్‌లో కూడా అదే గొడవ, అదే రచ్చ నడుస్తుంది. అదే సమయంలో హీరో గురించి హీరోయిన్‌కి కొన్ని విషయాలు తెలియడం, ఆయనకు ఆమె ఇంప్రెస్ కావడం, అయినా కూడా దాన్ని సీరియస్ వైపు వెళ్లకుండా కామెడీగానే నడిపించడం బాగుంది. మధ్యలో హడావుడి కోసం జీకే పేరుతో సంపత్‌రాజ్ పాత్రని పెట్టి యాక్షన్ యాంగిల్‌ని చూపించారు. తనపై పగబట్టిన రౌడీకి జూ ఎన్టీఆర్‌ని కలిపిస్తానని చెప్పడం, చివరకు వారి ఫ్యామిలీకి తన సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వడం, మరోవైపు గెట్ టూ గెదర్ అని తన ఫ్రెండ్స్ ని జూనియర్ ఆర్టిస్ట్ లు గా వాడుకోవడం ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటాయి. సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగుతూనే చివర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించిన తీరు మాత్రం బాగుంది. క్లైమాక్స్ ని ఎమోషనల్‌గా మార్చారు. కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి













