Dhurandhar: దురంధర్ కు పాక్ లో క్రేజ్ ఏ రేంజ్ లో అంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ సినిమా. రణవీర్ సింగ్ యాక్షన్ తో పాటుగా బాలీవుడ్ స్టార్లు అక్షయ్ ఖన్నా(Akshay Khanna), అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ స్క్రీన్ ప్రేజేన్స్ ఈ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చాయి. పెద్దగా స్టార్ లు లేకుండానే నిజ జీవిత కథను సిల్వర్ స్క్రీన్ పై చూపించడంలో ఆదిత్య ధార్ సక్సెస్ అయ్యారు. హీరోయిన్ సారా అర్జున్ కూడా ఆకట్టుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి, దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. గత నెలలో నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయిన తర్వాత, ధురంధర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించబడిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. 7.6 మిలియన్ వ్యూస్ తో షేక్ చేసింది. ఇక భారత్ తో సహా.. పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి
అయితే పాక్ లో నెట్ ఫ్లిక్స్ కాస్త ఖరీదైన విషయం కావడంతో.. సినిమాను చూసేందుకు అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమా పైరేటెడ్ డీవీడీలు పాకిస్తాన్లో బహిరంగంగా PKR 50 కంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. మన కరెన్సీలో కేవలం 16 రూపాయలు మాత్రమే. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ “ధురంధర్: ది రివెంజ్” మార్చి 19న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి













